Share News

Minister Vivek Venkataswamy: వెట్టిచాకిరి నిర్మూలిద్దాం

ABN , Publish Date - Jul 31 , 2025 | 04:56 AM

రాష్ట్రాన్ని వెట్టిచాకిరి నుంచి నిర్మూలించడమే ప్రభుత్వ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి అన్నారు

Minister Vivek Venkataswamy: వెట్టిచాకిరి నిర్మూలిద్దాం

  • మీ బాధలు కదిలించాయి.. అండగా ఉంటా: అమల అక్కినేని

హైదరాబాద్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని వెట్టిచాకిరి నుంచి నిర్మూలించడమే ప్రభుత్వ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి అన్నారు. వెట్టిచాకిరి నుంచి విముక్తి పొందిన కార్మికులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించడంతో పాటు ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించారు. జాతీయ వెట్టిచాకిరి విముక్తి దినోత్సవం సందర్భంగా బుధవారం బేగంపేటలోని సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌ (సెస్‌)లో జరిగిన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. వెట్టిచాకిరి, అక్రమ రవాణా సంబంధిత ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక టోల్‌ ఫ్రీ నెంబరును 8069 434343 ఆయన ఆవిష్కరించారు. ఇక నుంచి ఫిబ్రవరి 9న వెట్టి చాకిరి విముక్తి దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. ఈ సమావేశంలో 200మందికి పైగా పెట్టి చాకిరి నుంచి విముక్తులైన కార్మికులు పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి మాటలు తన మనసును కదిలించాయని బ్లూ క్రాస్‌ వ్యవస్థాపకురాలు అమల అక్కినేని భావోద్వేగానికి లోనయ్యారు. వీరందరికి తన పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తప్పు చేస్తే జగన్ అరెస్ట్ కావడం ఖాయం: ఏపీ బీజేపీ చీఫ్

ఈ ఆకును నాన్ వేజ్‌తో కలిపి వండుకుని తింటే ..

For More International News And Telugu News

Updated Date - Jul 31 , 2025 | 04:56 AM