Share News

Uttam Kumar Reddy: కబ్జా అయిన ఇరిగేషన్‌ భూములను.. స్వాధీనం చేసుకుంటాం

ABN , Publish Date - Aug 01 , 2025 | 04:55 AM

ఆక్రమణలకు గురైన నీటిపారుదల శాఖ భూములన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన స్వాధీనం చేసుకుంటామని ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌

Uttam Kumar Reddy: కబ్జా అయిన ఇరిగేషన్‌ భూములను.. స్వాధీనం చేసుకుంటాం

ఆక్రమణలకు గురైన నీటిపారుదల శాఖ భూములన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన స్వాధీనం చేసుకుంటామని ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రకటించారు. నీటిపారుదల శాఖ భూముల పరిరక్షణపై గురువారం సచివాలయంలో ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని గండిపేట, రాజేంద్రనగర్‌ మండలాల పరిధిలోని హిమాయత్‌సాగర్‌, కిస్మత్‌పుర, వాలంతరి, తెలంగాణ ఇంజనీరింగ్‌ రిసెర్చ్‌ ల్యాబొరేటరీ(టీజీఈఆర్‌ఎల్‌)లకు చెందిన 426.3 ఎకరాల స్థలాలు ఉండగా.. 131.31 ఎకరాలు కబ్జాకు గురైనట్లు గుర్తించామన్నారు. ఐటీఐఆర్‌ ఆధీనంలోని 81.26 ఎకరాల స్థలంపై కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా, మిగిలిన 50.13 ఎకరాలు కబ్జాకు గురైనట్టు వెల్లడించారు. ఈ భూములపై జిల్లా కోర్టులో 20 కేసులు, హైకోర్టులో మరో 2 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు గాను నీటిపారుదల శాఖ, హైడ్రా, రెవెన్యూ శాఖలు ఆర్‌అండ్‌ఆర్‌ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించామని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ పర్యటన.. ప్రశాంతి రెడ్డి రియాక్షన్

జగన్ జైలుకు వెళ్తారా అంటే.. లోకేష్ ఏమన్నారంటే..

For More Telangana News And Telugu News

Updated Date - Aug 01 , 2025 | 04:55 AM