Share News

Ponnam Prabhakar: మహోన్నత ఆదర్శమూర్తి ఫూలే

ABN , Publish Date - May 26 , 2025 | 04:40 AM

సామాజిక సంస్కరణలు, సమానత్వం, విద్యావ్యాప్తికి ఎనలేని కృషి చేసిన మహోన్నతమైన ఆదర్శమూర్తి మహాత్మ జ్యోతిరావు ఫూలే అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

Ponnam Prabhakar: మహోన్నత ఆదర్శమూర్తి ఫూలే

  • వెనుకబడిన వర్గాల వికాసానికి స్ఫూర్తి ప్రదాత: పొన్నం

హైదరాబాద్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): సామాజిక సంస్కరణలు, సమానత్వం, విద్యావ్యాప్తికి ఎనలేని కృషి చేసిన మహోన్నతమైన ఆదర్శమూర్తి మహాత్మ జ్యోతిరావు ఫూలే అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన మహాత్మా జ్యోతిరావు ఫూలే సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. సామాజిక మార్పు, సంస్కరణలు, సమానత్వం, మహిళా సాధికారత కోసం జ్యోతిరావు ఫూలే, సావిత్రి బాయి ఫూలే దంపతులు అమూల్యమైన సేవలను అందించారని కొనియాడారు.


ప్రముఖ సామాజిక వేత్త కంచె ఐలయ్య సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఫూలే సినిమాను తెలుగులో డబ్బింగ్‌ చేయించనున్నట్లు తెలిపారు. ఫూలే సినిమా వీక్షించిన వారిలో ప్రభుత్వ సహలదారు కేశవ రావు, సామాజిక వేత్త కంచె ఐలయ్య, ఎంపీలు సురేష్‌ షెట్కర్‌, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌ తదితరులు ఉన్నారు.


ఇవి కూడా చదవండి

Shashi Tharoor: పార్టీ కోసమే పని చేస్తున్నా.. క్లారిటీ ఇచ్చిన శశిథరూర్

ponnam prabhakar: తల్లిదండ్రులు వారి పిల్లలను శక్తి మేర చదివించాలి: పొన్నం

Updated Date - May 26 , 2025 | 04:40 AM