Minister Laxman Kumar: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు తప్పిన ప్రమాదం
ABN , Publish Date - Jun 28 , 2025 | 08:40 PM
Minister Adluri Laxman Kumar: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కారు ప్రమాదానికి గురైంది. ఆయన ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. దీంతో మంత్రి కారు టైరు ఊడిపోయింది.

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ,ఎస్టీ మైనార్టీ,వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కారు ప్రమాదానికి గురైంది. ఆయన ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. దీంతో మంత్రి కారు టైరు ఊడిపోయింది. శనివారం సాయంత్రం మెట్‌పల్లి నుంచి ధర్మపురి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో మంత్రితో పాటు ఎవ్వరికీ ఏమీ కాలేదని తెలుస్తోంది. ఇక, తన కారు టైరు ఊడిపోవంటంతో కార్యకర్త కారులో మంత్రి వెళ్లిపోయారు.
హరీష్ రావుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కౌంటర్
మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘నిరుద్యోగులకు బీఆర్ఎస్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో హరీష్ చెప్పగలరా. బీఆర్ఎస్ ఇచ్చిన ఉద్యోగాలపై శ్వేత పత్రం విడుదల చేసే దమ్ముందా. ఒక్క ఉద్యోగికి అయినా.. కేసీఆర్ నియామక పత్రం అందించారా. ప్రజలను డైవర్ట్ చేసేలా హరీష్ మాట్లాడుతున్నారు.
నిరుద్యోగులను ఏడిపించింది మీరు కాదా. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బీఆర్ఎస్ పాడు చేసింది. కాంగ్రెస్ పాలనను చూసి ఓర్వలేక పోతున్నావా. నిరుద్యోగుల గురించి మాట్లాడే హక్కు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు లేదు. మీ మనుగడ కోసమే ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఒకే ఏడాదిలో 59 వేల ఉద్యోగాలు ఇవ్వలేదు’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
పాత బాకీ అడిగితే ఇలా కొడతారా..
మహా న్యూస్ పై దాడిని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు, లోకేష్