Medaram: మేడారంలో వనదేవతల గద్దెలకు కొత్త రూపు
ABN , Publish Date - Jul 04 , 2025 | 04:21 AM
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని వనదేవతలైన సమ్మక్క సారలమ్మల గద్దెల స్వరూపం మారనుంది.

కొత్త డిజైన్ రూపొందించిన వాస్తుశిల్పి రాజశేఖర్
తాడ్వాయి, జూలై 3(ఆంధ్రజ్యోతి): ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని వనదేవతలైన సమ్మక్క సారలమ్మల గద్దెల స్వరూపం మారనుంది. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా శాశ్వత ప్రాతిపదికన గద్దెల డిజైన్‌ను మార్చనున్నారు. మేడారంలోని ఐటీడీఏ అతిథి భవనంలోని సమావేశ మందిరంలో జరిగిన మహాజాతర సమీక్ష సమావేశంలో దేవాదాయ ఆర్కిటెక్ట్(వాస్తుశిల్పి) రాజశేఖర్ ప్రొజెక్టర్ ద్వారా స్ర్కీన్‌పై గద్దెల డిజైన్‌ను ప్రదర్శించారు. 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరిగే మేడారం మహాజాతరకు కొత్త గద్దెలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు కొత్తగా రూపొందించిన గద్దెల డిజైన్‌లపై ఆదివాసీ సంఘాలు ఎలా స్పందిస్తాయనేది ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి
రాయచోటిలో ఉగ్రవాదులు అరెస్ట్.. కీలక అప్ డేట్..
తెలంగాణ నీటి వాటాను ఏపీకి దారాదత్తం చేశారు.. కేసీఆర్, హరీష్‌లపై మహేష్ గౌడ్ ఫైర్
టాలీవుడ్‌లో పైరసీ గుట్టు రట్టు.. ఒకరి అరెస్ట్
Read latest Telangana News And Telugu News