Share News

Mahesh Kumar Goud: ప్రజల వద్దకు కాంగ్రెస్‌

ABN , Publish Date - Jul 29 , 2025 | 04:09 AM

స్థానిక ఎన్నికలకు క్షేత్రస్థాయి నేతలు, కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు ‘ప్రజల వద్దకు కాంగ్రెస్‌’ అనే పేరుతో టీపీసీసీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

Mahesh Kumar Goud: ప్రజల వద్దకు కాంగ్రెస్‌

  • 31 నుంచి ఆగస్టు 6 వరకు నియోజకవర్గాల్లో పాదయాత్ర

  • పాల్గొననున్న మహేశ్‌గౌడ్‌, మీనాక్షి, మంత్రులు, నేతలు

  • పరిగిలో యాత్ర ప్రారంభం

హైదరాబాద్‌/ వికారాబాద్‌, జూలై 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): స్థానిక ఎన్నికలకు క్షేత్రస్థాయి నేతలు, కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు ‘ప్రజల వద్దకు కాంగ్రెస్‌’ అనే పేరుతో టీపీసీసీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉమ్మడి జిల్లాల్లో ఒక్కో నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టింది. తొలి విడత ఈ నెల 31 నుంచి 6 రోజుల పాటు ఉమ్మడి జిల్లాల్లో రోజుకో నియోజకవర్గం చొప్పున వారి పాదయాత్ర సాగనుంది. ‘ప్రజల వద్దకు కాంగ్రెస్‌’ పేరుతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం రంగాపూర్‌లో ఈ నెల 31 సాయంత్రం 5 గంటలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌తో కలిసి ఏఐసీసీ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్‌ ప్రారంభించనున్నారు. 10 కి.మీ దూరం పాదయాత్రలో పాల్గొని, అదేరోజు రాత్రి ఆ రాత్రి నియోజకవర్గంలోనే వారు పల్లె నిద్ర చేస్తారు. మరునాడు ఉదయం పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఆయా పల్లెల్లో శ్రమదానంలో పాల్గొంటారు.


తర్వాత ఒక ఫంక్షన్‌ హాల్‌లో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమై స్థానిక సమస్యలు అడిగి తెలుసుకుని, వాటికి పరిష్కార మార్గాలు ఆలోచిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకల్లా మరో నియోజకవర్గానికి చేరుకుని పాదయాత్ర చేస్తారు. ఈ కార్యక్రమంలో మహే్‌షగౌడ్‌, మీనాక్షీ నటరాజన్‌తోపాటు ఆయా ఉమ్మడి జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్‌ నాయకులు పాల్గొంటారు. తొలి విడతగా ఈ నెల 31న పరిగి, ఆగస్టు 1న ఆంథోల్‌, 2న ఆర్మూర్‌, 3న ఖానాపూర్‌, 4న చొప్పదండి, 5న వర్థన్నపేట నియోజకవర్గాల్లో మహే్‌షగౌడ్‌, మీనాక్షీ నటరాజన్‌ పాదయాత్ర కొనసాగనుంది. 6న వర్థన్నపేటలో శ్రమదానం, కార్యకర్తల సమావేశంతో తొలి విడత పాదయాత్ర ముగుస్తుంది. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలతో ‘ప్రజల వద్దకు కాంగ్రెస్‌’ కార్యక్రమం విజయవంతానికి పార్టీ ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌, పార్టీ నేతలు డాక్టర్‌ కేతూరి వెంకటేష్‌, జూలూరు ధనలక్ష్మి, పులి అనిల్‌కుమార్‌లతో సమన్వయ కమిటీ ఏర్పాటైంది.


ఉమ్మడి జిల్లాల వారీగా మీనాక్షి భేటీలు

ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ నేతలు, ముఖ్య నాయకులతో మంగళవారం నుంచి ఏఐసీసీ ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్‌ కొనసాగించనున్నారు. ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ భేటీల్లో టీపీసీసీ చీఫ్‌ మహే్‌షగౌడ్‌ సైతం పాల్గొంటారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, స్థానిక ఎన్నికలు, నామినేటెడ్‌ పోస్టుల భర్తీ తదితర అంశాలపై వారి అభిప్రాయాలు సేకరిస్తారు.


ఇవి కూడా చదవండి..

కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదు, మోదీకి ఫోన్ కాల్ రాలేదు

22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్

For More National News and Telugu News..

Updated Date - Jul 29 , 2025 | 04:09 AM