Share News

Congress: ఫూలే విగ్రహం పేరిట కవితది డ్రామా: మల్లు రవి

ABN , Publish Date - Apr 09 , 2025 | 03:52 AM

బీసీ రిజర్వేషన్లు, ఫూలే విగ్రహం పేరిట డ్రామా చేస్తున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు.. అసలు ఫూలే పేరు ఎత్తే అర్హత ఉందా అని కాంగ్రెస్‌ ఎంపీ మల్లు రవి ప్రశ్నించారు.

Congress: ఫూలే విగ్రహం పేరిట కవితది డ్రామా: మల్లు రవి

  • లిక్కర్‌ స్కాం మరకలు తుడిచేసుకునేందుకే..: ఆది శ్రీనివాస్‌

  • కవిత దీక్ష చేయడం సిగ్గుచేటు: జాజుల శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్‌/కవాడిగూడ/బర్కత్‌పుర, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేషన్లు, ఫూలే విగ్రహం పేరిట డ్రామా చేస్తున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు.. అసలు ఫూలే పేరు ఎత్తే అర్హత ఉందా అని కాంగ్రెస్‌ ఎంపీ మల్లు రవి ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్రంలో సామాజిక న్యాయం 200ు అమలవుతోందన్నారు. నియంత పాలనను తుడిచేసి.. ప్రగతి భవన్‌కు జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌గా నామకరణం చేసిన ఘనతా రేవంత్‌దేనని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జైలుకు వెళ్లి వచ్చాక బీఆర్‌ఎ్‌సలో తన స్థానం కోసం ఎమ్మెల్సీ కవిత అనేక విన్యాసాలు చేస్తున్నారని, లిక్కర్‌ స్కామ్‌ మరకలు తుడిచేసుకోవడానికి నానా పాట్లు పడుతున్నారని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. అసలు ఫూలే పేరును ఎత్తే అర్హత కవితకు ఉందా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత.. తీహర్‌ జైలు నుంచి వచ్చిన తర్వాత బయట కనిపించేందుకు ఏదో ఒకటి మాట్లాడుతున్నారని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు.


ఫూలే గురించి ఆమె ఇప్పుడు మాట్లాడుతున్నారని, కేసీఆర్‌ కట్టిన రాజభవనం కంచెను కూల్చి దానికి జ్యోతిరావు ఫూలే ప్రజా భవన్‌గా పేరు పెట్టిది కాంగ్రెస్‌ ప్రభుత్వమన్నది తెలుసుకోవాలన్నారు. అంబేడ్కర్‌, పూలే లాంటి మహనీయుల గురించి మాట్లాడే నైతిక హక్కు కవితకు లేదని ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌, కాంగ్రెస్‌ నేత పిడమర్తి రవి విమర్శించారు. ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో కవిత దీక్ష చేసిన స్థలాన్ని పిడమర్తి ఆధ్వర్యంలో ఫినాయిల్‌తో శుభ్రం చేసి నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఫూలే విగ్రహం పెట్టాలని కవిత దీక్ష చేయడం సిగ్గుచేటు అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ విమర్శించారు. బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఫూలే ఎందుకు గుర్తుకు రాలేదని నిలదీశారు. ఫూలే జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్‌గా బీసీ కుల సంఘాల కో చైర్మన్‌ చిన్న శ్రీశైలం యాదవ్‌ను నియమిస్తూ ఆయనకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సచివాలయం సమీపంలో రెండు ఎకరాల విస్తీర్ణంలో పూలే స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.


ఇవి కూడా చదవండి..

సింహానికి చుక్కలు చూపించిన తేనెటీగలు..

సిట్‌ కస్టడీకి ‘కల్తీ నెయ్యి’ నిందితులు

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Apr 09 , 2025 | 03:52 AM