Share News

Mahesh Kumar Goud: కవితపై మల్లన్న వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం

ABN , Publish Date - Jul 14 , 2025 | 03:41 AM

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితపై ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న వ్యాఖ్యలు గర్హనీయమని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. మహిళలను గౌరవించుకోవడం మన సంప్రదాయమని..

Mahesh Kumar Goud: కవితపై మల్లన్న వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం

  • ఆయన కార్యాలయంపై దాడి చట్ట వ్యతిరేకమే..

  • చట్టపరిధిలో అందరూ పనిచేసుకోవాలి: మహేశ్‌ గౌడ్‌

హైదరాబాద్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితపై ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న వ్యాఖ్యలు గర్హనీయమని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. మహిళలను గౌరవించుకోవడం మన సంప్రదాయమని.. కవితపై మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించాల్సిందేనని స్పష్టం చేశారు. అలాగే మల్లన్న కార్యాలయంపై దాడి చట్టవ్యతిరేకమని మండిపడ్డారు. చట్ట పరిధిలో అందరూ పనిచేసుకోవాలని ఆదివారం ఓ ప్రకటనలో సూచించారు.


మల్లన్న కార్యాలయంపై దాడి, గన్‌మెన్‌ కాల్పులు జరిపిన అంశాలపైన వచ్చిన ఫిర్యాదులపై చట్ట పరిధిలో విచారణ జరుగుతుందని తెలిపారు. బీసీ బిల్లు, రిజర్వేషన్లు అన్నీ కాంగ్రెస్‌ కృషి ఫలితమేనని పునరుద్ఘాటించారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో ఇతరులు లబ్ధి పొందాలని చూడడం సమంజసం కాదని హితవు పలికారు.

Updated Date - Jul 14 , 2025 | 03:42 AM