Mahesh Kumar Goud: సన్నబియ్యం కేంద్రమే ఇస్తే.. దేశమంతా ఎందుకివ్వట్లేదు?సన్నబియ్యం కేంద్రమే ఇస్తే.. దేశమంతా ఎందుకివ్వట్లేదు?
ABN , Publish Date - Apr 07 , 2025 | 04:01 AM
తెలంగాణలో కేంద్రమే సన్న బియ్యం పంపిణీ చేస్తుందంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు.

కేంద్ర మంత్రినన్న సంగతి మరిచి దిగజారి మాట్లాడొద్దు
బీజేపీ అధ్యక్ష పదవి దక్కడం లేదని ఆగమాగం
బండిపై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ విమర్శలు
హైదరాబాద్, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కేంద్రమే సన్న బియ్యం పంపిణీ చేస్తుందంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు. సన్న బియ్యం ఇచ్చేది బీజేపీనే అయితే.. దేశం మొత్తం ఎందుకు ఇవ్వట్లేదంటూ నిలదీశారు. బండి సంజయ్‌లో రోజురోజుకూ అభద్రతా భావం పెరిగిపోతోందని, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రాదని తెలిసి ఆగమాగమవుతున్నాడని ఆదివారం ఓ ప్రకటనలో విమర్శించారు. బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. కేంద్ర మంత్రి చెప్పులు మోసిన చరిత్ర సంజయ్‌దన్నారు. కాంగ్రెస్ సర్కారుపై నోటికి వచ్చింది మాట్లాడితే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు.
బండి సంజయ్‌కి దమ్ముంటే.. బీసీలకు 42ు రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన 2 బిల్లులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చేలా ప్రధానిని ఒప్పించాలన్నారు. ఢిల్లీ పెద్దలకు భయపడే తెలంగాణ బీజేపీ నేతలు.. బీసీ మహా ధర్నాకు ముఖం చాటేశారని విమర్శించారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల తరహాలోనే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎ్‌సతో బీజేపీ.. లోపాయికారి ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. మోదీ, అమిత్‌షాల వద్ద గుర్తింపు కోసం కేంద్ర మంత్రి అన్న సంగతి మరిచి.. సంజయ్ దిగజారి మాట్లాడుతున్నారన్నారు. హెచ్‌సీయూ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, రాజకీయ అవసరాల కోసం బండి సంజయ్ మాట్లాడటం సరికాదని ఆయన పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
HCU Land: హెచ్‌సీయూ వివాదంలో నిజాలు ప్రచారం చేయండి
No Exam: ఈ అర్హత చాలు.. పరీక్ష లేకుండా ఉద్యోగం.. నెలకు రూ. 2 లక్షల జీతం
Water Conflict: నీటి పంచాయతీ.. అధికారులతో ఉత్తమ్ కీలక భేటీ
Healthy Soup: ఈ సూప్‌తో మీ శరీరంలో కొన్ని భాగాలకు ఊహించని శక్తి పక్కా
Cotton Clothing: కాటన్ దుస్తులు.. ఒరిజినలా? కాదా? ఎలా గుర్తించాలంటే..
Fake Cardiologist: ఏడుగురి ఉసురు తీసిన వైద్యుడు.. విచారణకు రంగం సిద్ధం
శ్రీలీలకి చేదు అనుభవం.. చెయ్యి పట్టుకుని లాగిన యువకులు
కేసు No.62.. సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్ పై విచారణ
For Telangana News And Telugu News