Mahesh Kumar Goud: బీఆర్‌ఎస్, బీజేపీ.. బీసీ వ్యతిరేక పార్టీలు
ABN , Publish Date - Jul 24 , 2025 | 03:06 AM
బీజేపీ, బీఆర్‌ఎస్ బీసీ వ్యతిరేక పార్టీలుగా మారిపోయాయని, వాటిల్లోని బీసీ నేతలు ఆ పార్టీలకు రాజీనామా చేసి కాంగ్రె్‌సతో జత కట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ పిలుపునిచ్చారు.

వాటిల్లోని బీసీ నేతలు కాంగ్రె్‌సతో జతకట్టాలి.. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ పిలుపు
బీజేపీ ఎంపీలందరూ బీసీల వైపుంటే రిజర్వేషన్లు ఎందుకు పెరగవు: బల్మూరి
బీఆర్‌ఎస్.. బిజినెస్ రాష్ట్ర సమితి: అద్దంకి
హైదరాబాద్, జూలై 23 (ఆంధ్రజ్యోతి): బీజేపీ, బీఆర్‌ఎస్ బీసీ వ్యతిరేక పార్టీలుగా మారిపోయాయని, వాటిల్లోని బీసీ నేతలు ఆ పార్టీలకు రాజీనామా చేసి కాంగ్రె్‌సతో జత కట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ పిలుపునిచ్చారు. అగ్ర కులాల పార్టీల ఆధిపత్యాన్ని ఎదిరించి కాంగ్రెస్ పార్టీ తో జతకట్టాలని మహే్‌షకుమార్ గౌడ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు ఆర్డినెన్స్‌కు రాష్ట్రంలో బీఆర్‌ఎస్ మోకాలడ్డుతుండగా, అసెంబ్లీ ఆమోదంతో పంపిన బిల్లులను ఆమోదించేందుకు కేంద్రంలోని బీజేపీకి మనసొప్పడం లేదని విమర్శించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లంటే బీజేపీకి రుచించడం లేదని ఆరోపించారు. 9వ షెడ్యూల్‌లో చేర్చడం సాధ్యం కాదనుకుంటే అసెంబ్లీలో బీసీ బిల్లులకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎలా మద్దతిచ్చారు? బిల్లు ఢిల్లీకి వెళ్లాక ఎందుకు మాట మార్చారు? అని నిలదీశారు. బీసీ రిజర్వేషన్ల కోసం పార్లమెంట్‌ను స్తంభింపజేస్తామని స్పష్టం చేశారు. అమల్లో ఉన్న రిజర్వేషన్లను తగ్గించి, అసెంబ్లీలో వాకౌట్లు చేసిన చరిత్ర బీఆర్‌ఎ్‌సదని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆరోపించారు. కవిత అయోమయానికి గురవుతూ, సీఎం రేవంత్‌రెడ్డి విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం కోసమే ప్రభుత్వం బిల్లు తీసుకువచ్చిందని స్పష్టం చేశారు. బీజేపీ తరఫున రాష్ట్రం నుంచి గెలిచిన 8 మంది ఎంపీలు బీసీల పక్షాన నిలబడితే.. రిజర్వేషన్ల పెంపు సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. పదవుల కోసం టీఆర్‌ఎ్‌సను, వ్యాపారం కోసం బీఆర్‌ఎ్‌సను కేసీఆర్ పెట్టుకున్నారని ప్రస్తుతం బీఆర్‌ఎస్ బిజినెస్ రాష్ట్ర సమితిగా మారిందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శించారు. పదేళ్లపాటు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజల సొమ్ము తిన్న కేసీఆర్ కుటుంబం ఎందుకు జైలుకు పోవద్దు?అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబంలో నలుగురు జైలు పక్షులు ఉన్నారని, వారు ఎప్పుడైనా జైలుకు వెళ్లక తప్పదన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు ఎత్తులు జిత్తులు మానుకుని బీసీ రిజర్వేషన్ల పెంపునకు మద్దతు ఇవ్వాలని పీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం సూచించారు.
యూత్ కాంగ్రెస్‌కు 20 శాతం సీట్లు ఇవ్వాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ నాయకులకు 20 శాతం సీట్లు ఇవ్వాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్ గౌడ్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన మహేశ్‌గౌడ్.. అర్హత కలిగిన నేతలకు సముచిత స్థానం కల్పిస్తామన్నారని శివచరణ్‌రెడ్డి తెలిపారు.