గెలుపే ధ్యేయంగా పని చేయాలి
ABN , Publish Date - Jun 14 , 2025 | 11:30 PM
స్థా నిక సంస్థల ఎన్నికల్లో అందరూ కష్టపడి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేందుకు కృషి చేయాలని ఏఐసీసీ కార్యదర్శి, పార్టీ రాష్ట్ర కో ఇన్‌చార్జి పి.విశ్వనాథన్ పిలుపునిచ్చారు.
ఏఐసీసీ కార్యదర్శి, పార్టీ రాష్ట్ర కో ఇన్‌చార్జి విశ్వనాథన్
నారాయణపేట టౌన్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): స్థా నిక సంస్థల ఎన్నికల్లో అందరూ కష్టపడి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేందుకు కృషి చేయాలని ఏఐసీసీ కార్యదర్శి, పార్టీ రాష్ట్ర కో ఇన్‌చార్జి పి.విశ్వనాథన్ పిలుపునిచ్చారు. శనివారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని సీవీఆర్ భవన్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.ప్రశాంత్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. పి.విశ్వనాథన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిసారించారన్నారు. ఆయన సూచన మేరకు రాష్ట్రంలో పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టామన్నారు. ఈ నెల 25వ తేదీలోపు అన్ని మండల, బ్లాక్, గ్రామ అధ్యక్షుల నియామకాలను పూర్తి చేయాలని పరిశీలకులకు సూచించారు. పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకు, కార్యకర్తలకు తప్పకుండా అవకాశం ఇస్తామన్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు ఓడిపోతే డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జిలదే బాధ్యతన్నారు. ఎన్నికలను అందరు చాలెంజ్‌గా తీసుకొని పని చేయాలని కోరారు. జైబాపు, జైభీమ్, జైసంవిధాన్ కార్యక్రమాన్ని అన్ని మండలాల్లో పూర్తి చేయాలన్నారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో విడి విడిగా సమావేశమయ్యారు. పార్టీలో ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల కోసం ఆశావహుల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. కార్యక్రమంలో టీపీసీసీ నుంచి వచ్చిన జిల్లా పరిశీలకులు వేణుగౌడ్, సంధ్యారెడ్డి, ధారసింగ్ నాయక్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వార్ల విజయ్‌కుమార్, పేట ఏఎంసీ చైర్మన్ శివారెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ కోణంగేరి హన్మంతు, పట్టణ అధ్యక్షులు ఎండీ సలీం పాల్గొన్నారు.