Share News

నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటాం

ABN , Publish Date - Apr 28 , 2025 | 11:29 PM

అకాలవర్షం కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకునేలా సత్వర చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.

నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటాం

- ధరూరు, కేటీదొడ్డి మండలాల్లో పర్యటించిన ఎమ్మెల్యే

- ఐకేపీ కేంద్రం, పాడైన పంటలు, మామిడి తోటల పరిశీలన

ధరూరు, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): అకాలవర్షం కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకునేలా సత్వర చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం ధరూరు, కేటీదొడ్డి మండలాల్లో ఆయన పర్యటించారు. ధరూర్‌లోని ఐకేపీ కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గన్నీ బ్యాగుల సమస్యల ఉందని చెప్పడంతో ఆయన సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి గన్నీబ్యాగులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షానికి నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో ధాన్యం తడిసిందని, మామిడి తోటల్లో కూడా మామిడి కాయలు రాలిపోయి రైతులు నష్టపోయారని అన్నారు. రైతుల ఇబ్బందులను సీఎంతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం తరఫున ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే సంబంధి త అధికారులు పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వాని పంపి రైతులకు నష్టపరిహారం అందేలా చూడాలని చెప్పారు. ఎమ్మెల్యే వెంట పలువురు అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Updated Date - Apr 28 , 2025 | 11:29 PM