భూనీడులో కొవ్వొత్తులతో ప్రదర్శన
ABN , Publish Date - Apr 28 , 2025 | 11:17 PM
జమ్ము కశ్మీర్ పహల్గాంలో టూరిస్టులపై జరిగిన ఉగ్ర దాడిని ఖండిస్తూ కొత్తపల్లి మండలంలోని భూనీడు గ్రామంలో సోమవారం రాత్రి జేఏసీ గ్రామ సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.

కొత్తపల్లి ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): జమ్ము కశ్మీర్ పహల్గాంలో టూరిస్టులపై జరిగిన ఉగ్ర దాడిని ఖండిస్తూ కొత్తపల్లి మండలంలోని భూనీడు గ్రామంలో సోమవారం రాత్రి జేఏసీ గ్రామ సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పహల్గాంలో మరణించిన వారికి ఘన నివాళి అర్పించారు. కార్యక్రమంలో గ్రామస్థులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.