ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించాలి
ABN , Publish Date - Apr 27 , 2025 | 11:29 PM
భారతదేశం ఉగ్ర వాదాన్ని సమష్టిగా ఎదుర్కొంది. మతోన్మాదం, ఉగ్రవాదం, సామ్రాజ్య వాదాన్ని కూకటివేళ్లతో పెకిలించాలని అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం (ఏఐపీఎస్‌వో) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ పిలుపునిచ్చారు.

రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్
పాలమూరు, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి) : భారతదేశం ఉగ్ర వాదాన్ని సమష్టిగా ఎదుర్కొంది. మతోన్మాదం, ఉగ్రవాదం, సామ్రాజ్య వాదాన్ని కూకటివేళ్లతో పెకిలించాలని అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం (ఏఐపీఎస్‌వో) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని రెడ్‌క్రాస్ భవనంలో ఏఐపీఎస్‌వో ఆధ్వర్యంలో పహాల్గాం పర్యాటకులపై ఉగ్రదాడిని నిరసిస్తూ అశ్రునివాళి సభ జరిగింది. పట్టణంలో శాంతి ర్యాలీ, అనంతరం సభను ఏఐపీఎస్‌వో జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్‌గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. సభలో కమ్యూనిస్టు సీనియర్ నాయకుడు కందాల రామకృష్ణ, ఏఐపీఎస్‌వో జిల్లా సమన్వయకర్త ఎస్‌ఎం ఖలీల్, సామాజిక వేత్త ఎండీ హనీఫ్‌అహ్మద్ మాట్లాడారు. భారతదేశంలో హిందూ, ముస్లింల మధ్య పెరిగిన వైశ్యామ్యాలను మరింత రెచ్చగొట్టేందుకు కశ్మీర్ పర్యాటకులపై ఉగ్రమూకలు దాడి చేశారన్నారు. ఉద్దేశ పూర్వకంగానే మతం అడిగి మరీ చంపారన్నారు. హిందు, ముస్లింల మధ్య అగాధాన్ని పెంచి దేశంలో అస్థిరత్వం పెంచాలనుకున్నారు. కానీ భారత ప్రజలు ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పారన్నారు. హిందు, ముస్లింలు భావోద్వేగాలకు లోనుకాకుండా ప్రపంచం ముందు ఆదర్శంగా నిలబడ్డారని కొనియాడారు. కార్యక్రమంలో డీటీఎఫ్ వామన్‌కుమార్, ప్రభాకర్, గోవిందు, స్వీపర్ల సంఘం గట్టన్న, చంద్రాయుడు, ఆంజనేయులు, చైతన్య మహిళా సంఘం శ్రీదేవి, విజయకుమార్, యాదగిరి, కురుమూర్తి, జగపతిరావు, మల్లయ్య, ఫయాజ్, అయూబ్, ఖాదర్, నూరుల్‌హాసన్, మోసిన్‌ఖాన్, కోటి సుభాష్, నరేష్, కుర్మారెడ్డి, ఆంజనేయులు, జలాల్‌పాషా, బాలకృష్ణ, రహమాన్, జానీ, విజయభాస్కర్ పాల్గొన్నారు.