స్కాలర్‌షిప్ బకాయిలు వెంటనే చెల్లించాలి
ABN , Publish Date - Jul 30 , 2025 | 11:07 PM
ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయి నిధులు చెల్లించటంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందని గద్వాల జిల్లా బీజే పీ మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి ప్రశ్నించా రు.

- అయిజలో బీజేపీ నాయకుల ధర్నా
అయిజ టౌన్, జూలై 30 (ఆంధ్రజ్యోతి): వి ద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయి నిధులు చెల్లించటంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందని గద్వాల జిల్లా బీజే పీ మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి ప్రశ్నించా రు. బుధవారం అయిజలోని కొత్తబస్టాండ్ ఏరి యాలో మండల, పట్టణ అధ్యక్షులు గోపాలకృ ష్ణ, భగత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యార్థుల నిరసన కార్యక్రమంలో ఆయన పా ల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం గడిచినా ఇంకా ప్రభు త్వ, ప్రైవేటు కాలేజీల విద్యార్థులకు రావలసిన స్కాలర్‌షిప్‌ల బకాయిలు విడుదల చేయలేద న్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు.