భూభారతి చట్టంతో శాశ్వత పరిష్కారం
ABN , Publish Date - Apr 28 , 2025 | 11:30 PM
ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంతో ప్రతీరైతుకు శాశ్వత పరిష్కారం లభి స్తుందని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు.

- వడ్డేపల్లి అవగాహన సదస్సులో కలెక్టర్ బీఎం సంతోష్
వడ్డేపల్లి, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంతో ప్రతీరైతుకు శాశ్వత పరిష్కారం లభి స్తుందని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. ఈ చట్టం ద్వారా వివాదాలను తక్షణమే పరిష్కరిం చడంతో పాటు అన్నిరకాల సమస్యలు తొలగిపో తాయని తెలిపారు. సోమవారం వడ్డేపల్లిలో ని ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన భూ భారతి చట్టం-2025 అవగాహన సదస్సుకు కలెక్టర్ ము ఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.ధరణి చట్టంలో ఎదురైన సమస్యల పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం ప్రవేశపెట్టిందన్నా రు. ప్రతి రైతుకు ఆధార్‌కార్డులాగే భూదార్ కా ర్డు ఇవ్వనుందని, దీనివల్ల భూములకు సంబం ధించిన అన్ని రికార్డులు సులభంగా పొందగలు గుతారని తెలిపారు. భూ భారతి చట్టం ద్వారా అసైన్డ్ భూముల రెగ్యులరైజేషన్, సాదా బైనా మాల సమస్యలు, సరిహద్దు వివాదాలు, మ్యూ టేషన్, రిజిస్ర్టేషన్ వంటి అంశాలు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని తెలిపారు. రైతుల సర్వే సమస్యలను పరిష్కరించేందుకు లైసెన్స్‌డ్ సర్వే యర్లను నియమించనుందని, దీనిద్వారా భూ ములకు సంబందించిన వివాదాలు సర్వే చేసి మ్యాపులతో పట్టా పాస్ పుస్తకంలో చేర్చుకోవడా నికి అవకాశం ఉందన్నారు. రిజిస్ర్టేషన్, గిఫ్ట్‌డీ డ్, పార్టిషన్, మ్యూటేషన్, ల్యాండ్ ఎక్స్చేంజ్, వా రసత్వం వంటి చిన్న సమస్యలు తహసీల్దార్ స్థాయిలో పూర్తి అవుతాయని కలెక్టర్ వివరించా రు. ఓఆర్‌సీ, ఇనామ్, అసైన్‌మెంట్, సీలింగ్, ల్యాండ్, లోక్‌అదాలత్ తదితర భూ సమస్యలు ఆర్డీవో స్థాయిలో పరిష్కరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, తహసీల్దార్ వీరభద్రప్ప, జిల్లా గ్రంథాలయ సం స్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు, అలంపూర్ మా ర్కెట్ యార్డు చైర్మన్ దొడ్డప్ప, వడ్డేపల్లి మార్కెట్ యార్డు వైస్‌చైర్మన్ కుమార్, మునిసిపల్ కమిష నర్ రాజప్ప, అధికారులు, రైతులు ఉన్నారు.