Share News

సాగుబడిలో పాఠాలు

ABN , Publish Date - Jul 31 , 2025 | 11:42 PM

నాగర్‌కర్నూల్‌ జిల్లా, బిజినేపల్లి మండలంలోని పాలెం వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులు సాగు బడిలో పాఠాలు నేర్చుకుంటున్నారు.

సాగుబడిలో పాఠాలు
ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో వరినాట్లు వేస్తున్న వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులు

బిజినేపల్లి, జూలై 31 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్‌ జిల్లా, బిజినేపల్లి మండలంలోని పాలెం వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులు సాగు బడిలో పాఠాలు నేర్చుకుంటున్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ దక్షిణ తెలంగాణ వ్యవసాయ పరిశోధన కేంద్రంలోని ప్రదర్శన మడిలో గురువారం తాడుపట్టి వరి నాట్లు వేయడంపై శిక్షణ పొందారు. ఈ సందర్భంగా ఏడీఆర్‌ (అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ రిసెర్చ్‌) డాక్టర్‌ రాంప్రకాశ్‌ మాట్లాడుతూ తరగతి ప్రొఫెసర్లు నేర్పించిన అంశాలను విద్యార్థులు క్షేత్ర స్థాయిలో ప్రయోగాత్మకంగా చేయడం, పరిశీలించడం ద్వారా వారికి సంపూర్ణ అవగాహన కలుగుతుందన్నారు. వివిధ పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెళకువలు, పంటకాలం, ఆశించే తెగుళ్లు, వాటి నివారణ, పెట్టుబడి, దిగుబడి, ఆదాయం తదితర విషయాలపై అవగాహన కలుగుతుందని చెప్పారు.

Updated Date - Jul 31 , 2025 | 11:42 PM