అందరి సహకారంతోనే కొడంగల్ అభివృద్ధి
ABN , Publish Date - Apr 28 , 2025 | 11:07 PM
పార్టీలకతీతంగా కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి అందరు కలిసి రావాలని కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి అన్నారు.

- రానున్న నాలుగేళ్లలో మారనున్న నియోజకవర్గ రూపురేఖలు
- కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి
కోస్గి, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): పార్టీలకతీతంగా కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి అందరు కలిసి రావాలని కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి అన్నారు. సోమవారం కోస్గి మండలంలో పలు అభివృద్ధి పనులకు ఆయన భూమిపూజ చేశారు. మండలంలోని చంద్రవంచ నుంచి ముర ఫా వరకు ముంగిమళ్ల మీదుగా నిర్మించనున్న బీటీ రోడ్డుకు, అలాగే తోగాపూర్ నుంచి పందిరి హనుమాన్, ఆర్‌అండ్‌బీ నుంచి పోతిరెడ్డిపల్లి వరకు, కోస్గి నుంచి తోగాపూర్ వరకు, వయా రాంపురం కోస్గి నుంచి ముక్తిపాడ్ వరకు, కోస్గి నుంచి మీర్జాపూర్ మీదుగా మద్దూర్ వరకు, తుంకిమెట్ల నుంచి నారాయణపేట రోడ్డు నాలుగు లైన్లుగా వెడల్పు చేసేందుకు గాను ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో కొడంగల్‌కు నిధులు లేక అభివృద్ధి చెందక ఎంతో నిర్లక్ష్యానికి గురైందని, ఇప్పుడు మంచి అవకాశం వచ్చిందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ వార్ల విజయ్‌కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రఘువర్ధన్‌రెడ్డి, మునిసిపల్ అధ్యక్షుడు బెజ్జు రాములు, పీఏసీఎస్ చైర్మన్ భీంరెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ గిరిప్రసాద్‌రెడ్డి, నాయకు లు హన్మంత్‌రెడ్డి, అన్నకిష్టప్ప, నరేందర్ తది తరులున్నారు.