చారిత్రక కట్టడాలను కాపాడాలి
ABN , Publish Date - Apr 27 , 2025 | 11:36 PM
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చారిత్రక కట్టడాలను రాష్ట్ర ప్రభుత్వం కాపాడవలసిన అవసరం ఉందని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు.

- బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి
అయిజ టౌన్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చారిత్రక కట్టడాలను రాష్ట్ర ప్రభుత్వం కాపాడవలసిన అవసరం ఉందని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం దేశ ప్రదాని నరేంద్రమోదీ మన్‌కీ బాత్ కార్యక్రమాన్ని అయిజ మండలంలోని దేవబండలో వీక్షించిన ఆయన మాట్లాడారు. అనంతరం గ్రామంలో ఉన్నటువంటి చారిత్రక రాతి బురుజును ఆయన పరిశీలించారు. గతంలో అనేక గ్రామాలలో రాతితో బురుజులు, బావులు, కోటలు కట్టి ఉన్నటువంటి ఆధారాలు నేటికి అనేక గ్రామా ల్లో దర్శనమిస్తున్నాయని తెలిపారు. ఇటువంటి చారిత్రక కట్టడాలు కనుమరుగు కాకుండా, ధ్వంసం కాకుండా భవితరాల వారి కోసం ప్ర భుత్వం కాపాడే చర్యలు తీసుకోవాలని కోరారు. 121వ, మన్‌కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని చెప్పినట్లుగా జన్మనిచ్చిన తల్లి పేరున ప్రతీ ఒక్కరు ఒక మొక్కను నాటి సంరక్షించాలని సూచించారు. అయిజలోని 66వ, బూత్‌లో పట్టణ బీజేపీ నాయకులు ప్రధాని మన్‌కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గోపాలకృష్ణ, పట్టణఅధ్యక్షుడు భగత్‌రెడ్డి గడిగె రఘు, చిన్నపల్లేశ్, సురేశ్, రంగస్వామి, మధుసూదన్, లక్ష్మన్‌గౌడ్, రామకృష్ణ, నర్సింహులు, వెంకటేశ్ ఉన్నారు.