Share News

రైతులు ‘భూభారతి’పై అవగాహన పెంచుకోవాలి

ABN , Publish Date - Apr 28 , 2025 | 11:05 PM

రైతులం దరు భూభారతి చట్టంపై అవగాహన పెంచుకోవాలని అప్పుడే భూసమస్యలకు పరి ష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే డాక్టర్‌ వాకిటి శ్రీహరి అన్నారు.

రైతులు ‘భూభారతి’పై అవగాహన పెంచుకోవాలి
కృష్ణ మండల కేంద్రంలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో మాట్లాడుతున్న ఎమ్మెల్యేశ్రీహరి, వేదికపై కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, ట్రైనీ కలెక్టర్‌ ప్రణయ్‌కుమార్‌

- మక్తల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ వాకిటి శ్రీహరి

మాగనూరు/కృష్ణ, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): రైతులం దరు భూభారతి చట్టంపై అవగాహన పెంచుకోవాలని అప్పుడే భూసమస్యలకు పరి ష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే డాక్టర్‌ వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం మాగనూరు మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద భూభారతిపై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సుకు ఎమ్మెల్యే, కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని, ఈ చట్టంతో సమస్యలను మండల స్థాయిలోనే పరిష్కరించుకోవచ్చన్నారు. పెండింగ్‌లో ఉన్న సాదా బైనామాలు సైతం భూభారతిలో పరిష్కారం చేసుకోవచ్చన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ వచ్చే నెల నుంచి తహసీల్దార్లు మండలంలోని ప్రతీ గ్రామంలో భూభారతి సదస్సులు నిర్వహించి రైతులకు భూసమస్యలపై అవగాహన కల్పించి వచ్చిన దరఖాస్తులను పరిష్కరించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా రైతులు గన్నీ బ్యాగుల కొరత తీర్చాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌, ఆర్డీవో, తహసీల్దార్‌, ఎంపీడీవో, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు. అదేవిధంగా, కృష్ణ మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ ధరణి బూతాన్ని బంగాళాఖాతంలో కలిపి కొత్త భూభారతి చట్టాన్ని అమలు చే స్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ ప్రణయ్‌కుమార్‌, ఆర్డీవో రాంచందర్‌నాయక్‌, తహసీల్దార్‌ వెంకటేష్‌, ఎంపీడీవో జానయ్య, వ్యవసాయ శాఖ అధికారులు సుదర్శన్‌గౌడ్‌, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2025 | 11:05 PM