చికెన్, చేపలు తినేందుకు రాలేదు..
ABN , Publish Date - Aug 02 , 2025 | 11:51 PM
తాను కొల్లాపూర్‌కు మంత్రి జూపల్లి కృష్ణారావు పెట్టిన చికెన్, చేప తినడానికి రాలేదు.

కాంగ్రెస్ నాయకుడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ మల్లురవి
తాను కొల్లాపూర్‌కు మంత్రి జూపల్లి కృష్ణారావు పెట్టిన చికెన్, చేప తినడానికి రాలేదు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు వివరించేందుకు వచ్చానని, నేను మాట్లాడుతుండగా ఆపమనడానికి నువ్వు ఎవరంటూ కాంగ్రెస్ నాయకుడిపై ఎంపీ మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొల్లాపూర్ సభలో ఎంపీ ప్రసంగిస్తుండగా ప్రసంగం ఆపాలని చిట్టి రాసి ఇవ్వడంతో మల్లు రవి ఆ నాయకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను సొల్లు మాట్లాడడం లేదని, ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నానని, నన్ను ఆపమని చెప్పడానికి నువ్వు ఎవరు అని మండి పడ్డారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే అభివృద్ధిలో ముందుకు సాగుతోందని అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో దాదాపుగా రూ.100 కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులను ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.