ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి
ABN , Publish Date - Apr 28 , 2025 | 11:07 PM
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ జిల్లా అధికారులను ఆదేశించారు.

మహబూబ్‌నగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి) : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రజల నుంచి 86 ఫిర్యాదులు స్వీకరించారు. స్వీకరించిన ప్రతీ ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఏ ఒక్క ఫిర్యాదు ఉండవద్దని సూచించారు. కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, కలెక్టరేట్ ఏవో శంకర్, అర్బన్ తహసీల్దార్ ఘాన్సీరామ్, డీఎంహెచ్‌వో డాక్టర్ కృష్ణ పాల్గొన్నారు.