మళ్లీ బీఆర్‌ఎస్‌దే అధికారం
ABN , Publish Date - Apr 27 , 2025 | 11:30 PM
మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే కావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఇందుకు వరంగల్ జరిగే రజతోత్సవ సభ ఒక వేదికని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు.

- దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
భూత్పూర్ /గండీడ్/రాజాపూర్/నవాబ్‌పేట/చిన్నచింతకుంట/దేవరకద్ర/బాలానగర్, మూసాపేట మిడ్జిల్ హన్వాడ ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి) : మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే కావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఇందుకు వరంగల్ జరిగే రజతోత్సవ సభ ఒక వేదికని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం భూత్పూర్ చౌరస్తాలో బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను పార్టీ మండల అధ్యక్షుడు, మాజీ మునిసిపల్ చైర్మన్ బస్వరాజుగౌడ్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వరంగల్‌లో జరిగే రజతోత్సవ మహాసభకు నియోజవర్గంలోని వివిద మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు వందలాది వాహనాల్లో తరలిరాగా, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి జెండాను ఊపి వాహనాలను ప్రారంభించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ రజతోత్సవ మహాసభకు నియోజవర్గం నుంచి దాదాపు 3వేల మందిని తీసుకెళ్లాల్సి ఉండగా, 5వేల మందికి పైగా ఈ సభకు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని తెలిపారు. మాజీ ఎంపీపీ చంద్రశేఖర్‌గౌడ్, సింగిల్ విండో అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, మాజీ సర్పంచ్ నారాయణగౌడ్, నాయకులు పాల నర్సిములుగౌడ్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు యాదిరెడ్డి, మురళిధర్‌గౌడ్, సత్యనారాయణ, ఎం.సత్యనారాయణ, పోలీసు గోపాల్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సురేందర్‌గౌడ్ పాల్గొన్నారు.
గండీడ్ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం జడ్పీటీసీ మాజీ శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ అధ్యక్షుడు పెంట్యానాయక్, గోపాల్ ఆధ్వర్యంలో వరంగల్ రజతోత్సవ సభకు తరలివెళ్లారు. రాజాపూర్ మండల కేంద్రం నుంచి డీసీఎంస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, పార్టీ అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో, నవాబ్‌పేట బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మాడెమెని నర్సింహులు ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు రజతోత్సవ సభకు తరలివెళ్లారు. చిన్నచింతకుంట మండల అధ్యక్షుడు కోట రాములు, దేవరకద్ర మండల అధ్యక్షుడు నర్సింహరెడ్డి, బాలానగర్ మండల కేంద్రంలో ఆ పార్టీ నాయకుడు వైస్ ఎంపీపీ వెంకటాచారి, మూసాపేట, అడ్డాకుల మండల కేంద్రాల్లో జడ్పీటీసీ మాజీ సభ్యుడు రాజశేఖర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తోకల శ్రీనివాస్‌రెడ్డి, మిడ్జిల్ మండల కేంద్రంలో పీఎసీఎస్ ఛైర్మన్ కూచురు శ్రీనివాస్‌రెడ్డి, మండల అధ్యక్షుడు పాండు, హన్వాడ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో బీఆర్‌ఎస్ జెండాను ఆవిష్కరించిన అనంతరం రజతోత్సవ సభకు తరలివెళ్లారు.
జడ్చర్ల : బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం మునిసిపల్ చైర్‌పర్సన్ పుష్పలత పట్టణంలోని 14వ వార్డులో మినీ ట్యాంక్‌బండ్ సమీపంలో పార్టీ జెండాను ఆవిష్కరించగా, 24వ వార్డులో కౌన్సిలర్ ప్రశాంత్‌రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సి.లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు సుమారు 3వేల మందికి పైగా తరలివెళ్లారు.