భూ భారతి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
ABN , Publish Date - Jul 30 , 2025 | 11:04 PM
భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులపై తహసీల్దార్లు దృష్టిసారించి వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ తహసీల్దార్లను ఆదేశించారు.

కలెక్టర్ బీఎం సంతోష్
గద్వాల న్యూటౌన్, జూలై 30 (ఆంధ్రజ్యోతి): భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులపై తహసీల్దార్లు దృష్టిసారించి వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ తహసీల్దార్లను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ సమావేశపు హాలులో తహసీల్దా ర్లతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి వెంటనే పరిష్కారం చేయాలన్నారు. భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన సక్సేషన్, పెండింగ్ మ్యుటేషన్, పీవోపీ, డీ.ఎస్. పెండింగ్ అన్ని దరఖాస్తులు పరిష్కరించాల్సి ఉన్నందున దరఖాస్తుల పరిష్కారానికి తగినచర్యలు తీసుకోవాలని అధికారులకు సూ చించారు. దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలని ఆదేశించారు. వచ్చేవారం చేపట్టిన చర్యలపై తిరిగి సమీక్షించడం జరుగుతుందన్నారు. మీసేవా ద్వారా వచ్చే బర్త్, డెత్, ఆదా య, స్థానికం, యాఫ్-లైన్ సర్టిఫికెట్స్‌ను ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని తహసీల్దార్లకు సూ చించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్‌డీవో అలివేలు, ఏవో భూపాల్‌రెడ్డి, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు ఉన్నారు.
గోనుపాడు కేజీబీవీ తనిఖీ
గద్వాల సర్కిల్ : గద్వాల శివారులోని గోనుపాడు కస్తుర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని మంగళవారం కలెక్టర్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల, బోధకుల హాజరు రిజి స్టర్లు, వంటగది, తాగునీరు, భోజనం నాణ్యత, పరిసరాలను పరిశీలించారు. భోజన మెనూ పా టించకపోవడంతో విద్యాలయ ఎస్‌వోకు మెమో జారీ చేయాల్సిందిగా సంబంధిత అధికారిని ఆ దేశించారు. విద్యార్థులకు నాణ్యమైన బోధనతో పాటు భోజనం అందించడంలో నిర్లక్ష్యం వహి స్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ఎఫ్ ఆర్‌ఎస్ యాప్‌ను వినియోగించాలని చెప్పా రు. అనంతరం అందుతున్న భోజనం, బోధన, వసతులు, సమస్యలపై విద్యార్థినులతో అడిగి తెలుసుకున్నారు.