ఎరువులు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే చర్యలు
ABN , Publish Date - Aug 01 , 2025 | 11:16 PM
జిల్లాలో రైతులకు ఎరువులు అందుబాటులో ఉండాలని ఎక్కువ ధరలకు విక్రయించిన, బ్లాక్‌కు తరలించిన చర్యలు తప్పవని కలెక్టర్ బీఎం సంతోష్ హెచ్చరించారు.

- హెచ్చరించిన జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్
- గద్వాలలో ఫర్టిలైజర్ దుకాణాల తనిఖీ
గద్వాల, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రైతులకు ఎరువులు అందుబాటులో ఉండాలని ఎక్కువ ధరలకు విక్రయించిన, బ్లాక్‌కు తరలించిన చర్యలు తప్పవని కలెక్టర్ బీఎం సంతోష్ హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులను ఆయన ఆకస్మికంగా తనిఖీచేశారు. మార్కెట్‌యార్డులో ఉన్న చిన్న కిష్టయ్య ట్రేడింగ్ కంపెనీ గోదాములోని ఫర్టిలైజర్‌ను ఆయన పరిశీలించారు. యూరియా స్టాక్ వివరాలను తెలుసుకున్నారు. ఈ పాస్ నమో దు ప్రక్రియను పరిశీలించారు. పత్తి రైతు నుంచి ఆధార్ సేకరించిన తర్వాతనే యూరియా విక్రయాలు జరగాలని సూచించారు. అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎరువుల స్టాక్ వివరాలను బోర్డుపై ప్రదర్శించాలని సూచించారు. జిల్లా అధికారులు జి ల్లాలోని ఎరువుల నిల్వలు, వినియోగం, ఇంకా ఎంత డిమాండ్ అనే వివరాలను సమగ్రంగా ఇవ్వాలని ఆదేశించారు. ఎరువుల కొరతలు ఉం టే ప్రభుత్వానికి నివేదించాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి సక్రియా నాయక్, ఏడీఏ సంగీతలక్ష్మి ఉన్నారు.