Share News

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

ABN , Publish Date - Apr 27 , 2025 | 11:36 PM

కొల్లాపూర్‌ నియోజకవర్గ పరిధిలోని పెంట్లవెల్లి మండలం జట ప్రోలు గ్రామానికి చెందిన మహమ్మద్‌ మజాహర్‌ (35) ఆదివారం రాత్రి రో డ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

కొల్లాపూర్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): కొల్లాపూర్‌ నియోజకవర్గ పరిధిలోని పెంట్లవెల్లి మండలం జట ప్రోలు గ్రామానికి చెందిన మహమ్మద్‌ మజాహర్‌ (35) ఆదివారం రాత్రి రో డ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సంఘటన వివ రాలు ఇలా ఉన్నాయి. నాగ ర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ పట్టణంలోని ఎన్టీఆర్‌ చౌర స్తాలో సాయికృప ఆసుపత్రి ముందు రెడీమేడ్‌ బట్టల షాప్‌ నిర్వ హిస్తున్న మజాహర్‌ ఆదివారం రాత్రి షాప్‌ మూసి తన సొంత గ్రామమైన జటప్రోలుకు మోటార్‌ బైక్‌పై వెళ్తున్నాడు. గ్రామ సమీ పంలో ఉన్న బ్రిడ్జి వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో అక్కడిక క్కడే యువకుడు మృతి చెందాడు. కొల్లాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

Updated Date - Apr 27 , 2025 | 11:36 PM