డ్రై డేను తప్పక నిర్వహించాలి
ABN , Publish Date - Aug 01 , 2025 | 11:17 PM
డ్రై డేను తప్పక నిర్వహించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ సిద్దప్ప సూచించారు.

- జోగుళాంబ గద్వాల జిల్లా డీఎంహెచ్‌వో సిద్ధప్ప
గద్వాల, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): డ్రై డేను తప్పక నిర్వహించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ సిద్దప్ప సూచించారు. శుక్రవారం మండల ప రిధిలోని జమ్మిచేడు ప్రాథమిక ఉప కేంద్రాన్ని ఆయన తనిఖీచేశారు. రికార్డులతో పాటు మందుల నిల్వలను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ శుక్రవా రం డ్రై డేను నిర్వహించడం ద్వారా కీటక జని త వ్యాధులను దూరం చేయవచ్చని సూచించారు. గ్రామస్థులకు హెల్డ్ ఎడ్యుకేషన్ చేయాలని సూచించారు. చికున్‌గునియా, డెంగీ, మ లేరియా వంటి వ్యాధులపై అవగాహన పెంచాలని సూచించారు. వర్షాకాలంలో విషజ్వరాలు, డయేరియా వంటివి రాకుండా ప్రజలు పాటించాల్సిన నియమాలను వారికి వివరించాలని సిబ్బందికి తెలియజేశారు. ఇంటిలోపలిక దోమ లు రాకుండా నివారించే పద్ధతి, చుట్టుపక్కల పరిశుభ్రత, తాగేనీరు కాచి చల్లారిని తర్వాత తీసుకోవడం, ఇంటి ముందర, పక్కల నీరు నిల్వ ఉండకుండా సూసుకోవడం వంటి వాటిని ప్రజలకు వివరించాలని తెలిపారు. ప్రతీ రోజు ఫీవ ర్ సర్వే నిర్వహించాలని సూపర్‌వైజర్లు పర్యవేక్షించాలని సూచించారు. ఆయనవెంట మెడిక ల్ ఆఫీసర్ కృష్ణవేణి, ఆరోగ్య విస్తరణ అధికారి రవిచందర్, ఎన్సీడీ జిల్లా సమన్వయకర్త శ్యాం సుందర్, ఏఎన్‌ఎం శోభారాణి పాల్గొన్నారు.