Share News

మహిళల ఆర్థికాభివృద్ధికి పెద్దపీట

ABN , Publish Date - Jul 29 , 2025 | 11:12 PM

రాష్ట్ర ప్ర భుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి పెద్దపీట వేస్తు న్నదని కలెక్టర్‌ బీఎం సంతోష్‌, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.

మహిళల ఆర్థికాభివృద్ధికి పెద్దపీట
మాట్లాడుతున్న కలెక్టర్‌ బీఎం. సంతోష్‌

- ఘనంగా ఇందిరా మహిళా శక్తి సంబురాలు

- హాజరైన కలెక్టర్‌ బీఎం సంతోష్‌

మల్దకల్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్ర భుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి పెద్దపీట వేస్తు న్నదని కలెక్టర్‌ బీఎం సంతోష్‌, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం వారు మల్దకల్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి, రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నా రు. ఈసందర్భంగా మాట్లాడుతూ మండలంలో ప్రసుతం 600కు పైగా మహిళా సంఘాలు క్రి యాశీలంగా పనిచేస్తుండగా, ఎనిమిది వేల మం దికిపైగా మహిళలు సభ్యులుగా ఉన్నారని అన్నా రు. ఇంకా అనేకమంది మహిళలు ఈ సంఘా ల్లో చేరాలని చెప్పారు. వడ్డీలేని రుణాలు, ఉపా ధి అవకాశాలు, వడ్ల కొనుగోలు కేంద్రాలు, యూ నిఫామ్‌ల తయారీ వంటి ఉపాధి ఆఽధారిత పథ కాలు విజయవతంగా అమలతున్నాయని అన్నా రు. మండలంలోని మహిళా సంఘాలకు గత ఏడాది రూ.72లక్షల వడ్డీ మాఫీ చేశామన్నారు. మహిళల కోసం పెట్రోల్‌ బంక్‌, రూ.3 కోట్ల వ్యయంతో ఒక మెగావాట్‌ సోలార్‌పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నా రు. మల్దకల్‌ మండలానికి 900కి పైగా కొత్తరేషన్‌ కార్డులు మంజూరు చేశామన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవా లని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లులక్ష్మీనారాయణ, నర్సింగరావు, మండల అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - Jul 29 , 2025 | 11:12 PM