Legislative Council: అసెంబ్లీ పాత భవన పునరుద్ధరణ పూర్తిచేయాలి
ABN , Publish Date - Aug 03 , 2025 | 06:02 AM
త్వరలో జరగనున్న శాసనమండలి సమావేశాలను అసెంబ్లీ పాత భవనంలో నిర్వహించేందుకు భవన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

పనులను పరిశీలించిన మండలి చైర్మన్
హైదరాబాద్, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): త్వరలో జరగనున్న శాసనమండలి సమావేశాలను అసెంబ్లీ పాత భవనంలో నిర్వహించేందుకు భవన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రోడ్లు భవనాల శాఖ, ఆగాఖాన్ సంస్థతో పాటు శాసనసభ అధికారులతో కలిసి ఆయన శనివారం పనులను పరిశీలించారు. అనంతరం జరిగిన సమీక్షా సమావేశంలో పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా వర్షాకాల సమావేశాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా పనులు పూర్తి చేయాలని సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా పాత అసెంబ్లీ భవనంలోనే మండలి సమావేశాలు నిర్వహించాలని ఆదేశించినట్టు తెలిపారు.