Lady Aghori: లేడీ అఘోరీని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు
ABN , Publish Date - Apr 22 , 2025 | 06:13 PM
Lady Aghori Arrested: కొత్త జంటకు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్,మధ్య ప్రదేశ్ సరిహద్దుల్లో లేడీ అఘోరీతో పాటు వర్షిణిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరినీ ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ నుంచి హైదరాబాద్ తీసుకుని వస్తున్నారు.

గత కొన్ని నెలల నుంచి లేడీ అఘోరీ పేరు సోషల్ మీడియాతో పాటు మీడియాలోనూ మారు మోగుతూ ఉంది. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో అఘెరీ వార్తలో నిలుస్తూ ఉంది. కొద్ది రోజుల క్రితం వర్షిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ జంట ఉత్తర ప్రదేశ్‌లో ఉంది. కొత్తగా పెళ్లయిన ఈ జంటకు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. 10 లక్షల రూపాయల మోసం కేసులో లేడీ అఘోరీని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్,మధ్య ప్రదేశ్ సరిహద్దుల్లో అదుపులోకి తీసుకున్నారు. లేడీ అఘోరీతో పాటు వర్షిణిని కూడా అక్కడినుంచి హైదరాబాద్‌కు తీసుకు వస్తున్నారు.
నగ్న పూజల పేరుతో మోసం
నగ్న పూజల పేరుతో లేడీ అఘోరీ తనను మోసం చేసిందని రంగారెడ్డి జిల్లా, శంకర్ పల్లి మండలం, ప్రొద్దుటూర్ మండలానికి చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన దగ్గరినుంచి ఏకంగా 10 లక్షల రూపాయలు మోసం చేసిందని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు.. 6 నెలల క్రితం ఆ మహిళకు లేడీ అఘోరీకి పరిచయం ఏర్పడింది. పరిచయం అయిన రెండు నెలల తర్వాత ఇద్దరూ ప్రగతి రిసార్ట్స్‌లో డిన్నర్‌కు కలిశారు. ఆ తర్వాతి నుంచి ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకునేవారు. అఘోరీ మహిళ కష్టాలు అడిగి తెలుసుకునేది.
ఓ పూజ చేస్తే కష్టాలు మొత్తం తీరిపోతాయని కూడా చెప్పింది. మహిళను నమ్మించింది. ఈ నేపథ్యంలోనే పూజ కోసం 5 లక్షల రూపాయల్ని అఘోరీ అకౌంట్‌లో వేసింది. ఆ తర్వాత యూపీలోని ఉజ్జయిని తీసుకెళ్లి అక్కడ పూజ చేసింది. మరుసటి రోజు మరో 5 లక్షలు అడిగింది. డబ్బులు ఇవ్వకపోతే పూజ విఫలం అవుతుందని భయపెట్టింది. అఘోరీ మాటలతో భయపడిపోయిన మహిళ మరో ఐదు లక్షలు అకౌంట్‌లో వేసింది. ఇలా మొత్తం పది లక్షలు స్వాహా అయ్యాయి. అఘోరీ అంతటితో ఆగకుండా.. మరో ఐదు లక్షలు కావాలంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇవి కూడా చదవండి
అక్కడ ఉండే ప్రతీ బిచ్చగాడి దగ్గర ఆ నటుడి ఫోన్ నెంబర్
Gold: పిల్లాడి కడుపులో 100 గ్రాముల బంగారం