KTR: ఈడీ చార్జిషీటులో సీఎం పేరు రాష్ట్రానికే అవమానం: కేటీఆర్
ABN , Publish Date - May 24 , 2025 | 03:35 AM
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ చార్జిషీట్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు నమోదు కావడం రాష్ట్రానికే అవమానకరమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

హైదరాబాద్, మే 23 (ఆంధ్రజ్యోతి): నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ చార్జిషీట్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు నమోదు కావడం రాష్ట్రానికే అవమానకరమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో యంగ్ ఇండియా సంస్థకు విరాళాల కోసం వ్యాపారవేత్తలకు పదవుల ప్రలోభాలు చూ పారని ఈడీ పేర్కొందని ప్రస్తావించారు.
కేంద్ర దర్యాప్తు సంస్థే చట్టపరమైన ఆధారాలతో చెబుతోందన్నారు. మొత్తం అవినీతి వ్యవహారంపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి, పొంగులేటిలు బీజేపీ పెద్దల కాళ్ల మీద పడగానే కేంద్రం చూసీ చూడనట్లు వదిలేస్తుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు.