KTR: ఫార్మా రైతులకు రేవంత్ నమ్మకద్రోహం
ABN , Publish Date - Aug 02 , 2025 | 04:34 AM
అనుముల అన్నదమ్ముల కోసమే ఫ్యూచర్‌సిటీని నిర్మిస్తూ.. ఫార్మాసిటీ భూములను రైతులకు ఇవ్వకుండా రేవంత్‌రెడ్డి నమ్మకద్రోహానికి పాల్పడుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.

వారి భూములు తిరిగి ఇచ్చేవరకు పోరాడతాం: కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): అనుముల అన్నదమ్ముల కోసమే ఫ్యూచర్‌సిటీని నిర్మిస్తూ.. ఫార్మాసిటీ భూములను రైతులకు ఇవ్వకుండా రేవంత్‌రెడ్డి నమ్మకద్రోహానికి పాల్పడుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అడుగడుగునా అన్నదాతలు నిరసన వ్యక్తంచేస్తున్నా ముఖ్యమంత్రికి బుద్ధి రావడంలేదన్నారు. అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దుచేసి భూములను తిరిగి ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇతర అవసరాలకు వాటిని మళ్లించడం దుర్మార్గమన్నారు.
ఓవైపు ఫార్మాసిటీని రద్దుచేస్తున్నట్టు ప్రకటించి, మరోవైపు కొనసాగిస్తామని హైకోర్టులో అఫిడవిట్ దాఖలుచేసిన రేవంత్.. ప్రజలను, న్యాయస్థానాలను సైతం మోసం చేసిందన్నారు. ఫ్యూచర్‌సిటీకి అక్రమంగా భూములు కేటాయిస్తే చూస్తూ ఊరుకోమని, భూములు తిరిగి ఇచ్చేవరకు రైతుల పక్షాన బీఆర్‌ఎస్ పోరాడుతుందని కేటీఆర్ వెల్లడించారు.