సంగమేశ్వర ఆలయ శిఖరాన్ని తాకిన కృష్ణమ్మ
ABN , Publish Date - Jun 21 , 2025 | 04:04 AM
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల వద్ద సప్తనదుల ప్రదేశంలో కొలువైన సంగమేశ్వర ఆలయ శిఖరాన్ని కృష్ణానది జలాలు తాకాయి. మరో నాలుగు రోజుల్లో ఆలయం పూర్తిగా జలాధివాసం కానుంది.

మరో 4 రోజుల్లో జలాధివాసం కానున్న ఆలయం
కొల్లాపూర్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల వద్ద సప్తనదుల ప్రదేశంలో కొలువైన సంగమేశ్వర ఆలయ శిఖరాన్ని కృష్ణానది జలాలు తాకాయి. మరో నాలుగు రోజుల్లో ఆలయం పూర్తిగా జలాధివాసం కానుంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ఈ ఏడాది ముందుగానే కృష్ణానదిలోకి వరద జలాలు చేరాయి.
కృష్ణమ్మ ఒడిలోకి సంగమేశ్వరుడు వెళ్లడంతో ఎంతో విశిష్టమైన వేపధారు శివలింగానికి చివరిసారిగా అర్చకులు పూజలు నిర్వహించారు. ఆరు నెలల తరువాతే ఆలయం తిరిగి భక్తులకు దర్శనం ఇవ్వనుండడంతో, భక్తులు ఆలయం గోపురాన్ని దర్శించుకుంటున్నారు.