Infrastructure Monitoring: అత్యవసరమైతేనే సెలవు
ABN , Publish Date - Jul 25 , 2025 | 04:53 AM
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులను రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు.

ఆర్ అండ్ బీ అధికారులకు మంత్రి కోమటిరెడ్డి ఆదేశం
హైదరాబాద్, జూలై 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులను రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు. అత్యవసరమైతే తప్ప సెలవులు తీసుకోవద్దన్నారు. జిల్లాల సూపరింటెండెంట్ ఇంజినీర్లు (ఎస్.ఈ) అందుబాటులో ఉండాలని, క్షేత్రస్థాయిలో ఈఈ, డీ.ఈ, ఏ.ఈల నుంచి ఎప్పటికప్పుడు రహదారులు, బ్రిడ్జిల పరిస్థితులను ప్రతి 3-4 గంటలకోసారి పర్యవేక్షిస్తూ, వివరాలు సేకరించాలన్నారు.
ఈ విషయమై రాష్ట్ర స్థాయిలో ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ), చీఫ్ ఇంజినీర్‌లు పర్యవేక్షించడంతోపాటు తనకూ నివేదిక ఇవ్వాలన్నారు. కల్వర్టులు, బ్రిడ్జిలు, నిర్మాణంలో ఉన్న రోడ్లతోపాటు వాగులు పొంగే దగ్గర గల బ్రిడ్జిల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.