Kaloji University VC resignation: కాళోజీ యూనివర్సిటీ వీసీ నందకుమార్ రాజీనామా..
ABN , Publish Date - Nov 28 , 2025 | 09:09 PM
కాళోజీ యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ డాక్టర్ నందకుమార్ రాజీనామా చేశారు. యూనివర్సిటీలో ఇటీవల పలు అవకతవకల నేపథ్యంలో ఆయనపై తీవ్ర ఆరోపణలు చెలరేగాయి. పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో అవకతవకలు, ఇష్టారీతిగా ఇన్ ఛార్జీల నియామకం తదితర ఘటనలపై ఆరోపణలు వెల్లువెత్తాయి.
కాళోజీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ నందకుమార్ రాజీనామా చేశారు. యూనివర్సిటీలో ఇటీవల పలు అవకతవకల నేపథ్యంలో ఆయనపై తీవ్ర ఆరోపణలు చెలరేగాయి. పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో అవకతవకలు, ఇష్టారీతిగా ఇన్ ఛార్జీల నియామకం తదితర ఘటనలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూనివర్సిటీలో అవకతవకలపై ఆరా తీశారు. కాళోజీ యూనివర్సిటీ వ్యవహారాల పై సీరియస్ అయ్యారు (P.V. Nanda Kumar Reddy resigns).
కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీలో ఏం జరుగుతోందో వివరణ ఇవ్వాలని వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఇది జరిగిన కాసేపటికే వీసీ నంద కుమార్ రాజీనామా చేసినట్టు ప్రకటించారు. ఉన్నత యూనివర్సిటీలో అస్తవ్యస్థ పరిస్థితులకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు (KNRUHS controversy).
ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఘటనల వెనుక ఎంతటి వారున్నా ఉపేక్షించే సమస్యే లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు (medical university VC resigns). ఉన్నత స్థాయి సంస్థల్లో పని చేసేవారు సమర్థంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పని చేయాలని సీఎం సూచించారు. ఈ క్రమంలో అనూహ్యంగా నందకుమార్ రాజీనామా నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ ల్యాండ్ పూలింగ్‌కు రంగం సిద్ధం
అమరావతి కోసం రుణం.. ఆమోదించిన ప్రభుత్వం
For More TG News And Telugu News