Mahesh Kumar Goud: 4న కాంగ్రెస్ సమ్మేళనానికి ఖర్గే రాక
ABN , Publish Date - Jul 02 , 2025 | 04:59 AM
జై బాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 4న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుల సమ్మేళనం నిర్వహించనున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్ గౌడ్ తెలిపారు.

విజయవంతానికి అంతా సమష్టిగా కృషి చేయాలి
పార్టీ నేతలతో టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షగౌడ్
రంగారెడ్డి అర్బన్/హైదరాబాద్, జూలై 1(ఆంధ్రజ్యోతి): జై బాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 4న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుల సమ్మేళనం నిర్వహించనున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్ గౌడ్ తెలిపారు. ఈ సమ్మేళనానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతారని చెప్పారు. మంగళవారం గాంధీ భవన్‌లో చేవెళ్ల, మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని, ఖర్గే సందేశాన్ని ప్రజలకు చేరవేయాలన్నారు. రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ పార్టీలో భేదాభిప్రాయాలు ఏమైనా ఉంటే పక్కనపెట్టి సభను విజయంతం చేయాలన్నారు. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, నాయకులు పాల్గొన్నారు. కాగా, ఈ సమ్మేళనం ఏర్పాట్లపై మంగళవారం సీఎం రేవంత్ ప్రజాభవన్‌లో మంత్రులు, మహేష్ గౌడ్‌తో సమీక్ష నిర్వహించారు.
సీఎం నిర్ణయం భేష్: మల్లు రవి
తల్లిదండ్రులను సరిగా చూడని ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోతపెట్టి.. ఆ మొత్తాన్ని నేరుగా తల్లిదండ్రులకు పంపాలని సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. ప్రజాపాలనకు ఇదే నిదర్శనమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.