Share News

Khammam: రాష్ట్ర న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడిగా ఖమ్మం జిల్లా జడ్జి రాజగోపాల్‌ ఎన్నిక

ABN , Publish Date - Jul 10 , 2025 | 04:18 AM

న్యాయాధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఖమ్మం జిల్లా జడ్జి జీ రాజగోపాల్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు..

Khammam: రాష్ట్ర న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడిగా ఖమ్మం జిల్లా జడ్జి రాజగోపాల్‌ ఎన్నిక

ఖమ్మం లీగల్‌, జూలై 9 (ఆంధ్రజ్యోతి): న్యాయాధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఖమ్మం జిల్లా జడ్జి జీ రాజగోపాల్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి రాజగోపాల్‌ ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైనట్టు ఎన్నికల అధికారి శశిధర్‌ రెడ్డి ప్రకటించారు. రాజగోపాల్‌ గతంలోనూ ఒకసారి అధ్యక్షుడిగా పనిచేశారు. సంఘం మహిళా ప్రతినిధిగా ఆర్థిక నేరాల ప్రత్యేక న్యాయస్థానం జడ్జిగా పనిచేస్తున్న జే మైత్రి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Updated Date - Jul 10 , 2025 | 04:18 AM