KCR: జిమ్‌లో వర్కవుట్లు చేస్తుండగా కేటీఆర్‌కు గాయం..
ABN , Publish Date - Apr 28 , 2025 | 09:27 PM
KCR: జిమ్‌లో వర్కవుట్లు చేస్తుండగా.. ఆయన నడుముకు గాయం అయింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఆస్పత్రికి వెళ్లారు. పరీక్షలు చేసిన డాక్టర్లు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు. ఈ విషయాలను స్వయంగా కేటీఆర్ తన ట్విటర్ ఖాతా ద్వారా తెలియజేశారు.

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గాయపడ్డారు. జిమ్‌లో వర్కవుట్లు చేస్తుండగా.. ఆయన నడుముకు గాయం అయింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఆస్పత్రికి వెళ్లారు. పరీక్షలు చేసిన డాక్టర్లు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు. ఈ విషయాలను స్వయంగా కేటీఆర్ తన ట్విటర్ ఖాతా ద్వారా తెలియజేశారు. ఈ మేరకు సోమవారం ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘ జిమ్‌లో వర్కవుట్ చేస్తుండగా.. నడుముకు గాయం అయింది. డాక్టర్లు కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు. త్వరగా కోలుకుని మీ ముందుకు వస్తా’ అని పేర్కొన్నారు.
ఆ కేసులో కేటీఆర్‌కు ఊరట
సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో కేటీఆర్‌కు భారీ ఊరట లభించింది. ఆ కేసును హైకోర్టు కొట్టి వేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేటీఆర్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం కేసును కొట్టివేసింది.
ఇవి కూడా చదవండి
Jagga Reddy: జగ్గారెడ్డి మాస్ డైలాగ్.. రాజకీయాల్లో విలన్ మేమే, హీరోలం మేమే
Meta AI Chatbot: అశ్లీలతకు అడ్డాగా మారిన మెటా ఏఐ చాట్ బాట్స్