Share News

ఆయిల్‌పామ్‌ సాగుకు పటిష్టమైన చర్యలు

ABN , Publish Date - Aug 03 , 2025 | 12:41 AM

రాజన్న సిరిసిల్ల జిల్లా లో ఆయిల్‌పామ్‌ పంటల సాగుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ఝా అదేశించారు.

ఆయిల్‌పామ్‌ సాగుకు పటిష్టమైన చర్యలు

సిరిసిల్ల కలెక్టరేట్‌, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి) : రాజన్న సిరిసిల్ల జిల్లా లో ఆయిల్‌పామ్‌ పంటల సాగుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ఝా అదేశించారు. సిరిసిల్ల సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శనివారం వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులకు ఆయిల్‌పామ్‌ సాగుపై అవగహన సదస్సును నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగు పెంచేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఆయిల్‌పామ్‌ మొక్కల సరఫరా చేసేందుకు ఫ్రీ యూనిక్యూ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీకి కేటాయిం చిందని అన్నారు. ఆయిల్‌పామ్‌ నర్సరీని సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని పెద్దబోనాల వద్ద రెండు ఎకరాలలో ఏడాది వయస్సులో ఉన్న మొక్క లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. నీటి పారుదల సౌకర్యం ఉన్న రైతులకు మొక్కలను అందిస్తామన్నారు. ఈ సందర్భం గా మండలాల వారిగా ఎంత టార్గెట్‌ ఇచ్చారు. ఎంత పూర్తి చేశారో వివరాలను వ్యవసాయాధికారులను అడిగి తెలుసు కున్నారు. నర్సరీ ఎక్కడ ఉంది దానిలో ఎన్ని మొక్కలు ఉ న్నాయి. ఏ విత్తనం వాడుతున్నారని మొక్కలు సరఫరా చేసే కంపెనీ బాధ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయిల్‌పామ్‌ సాగు కోసం అవసరమైన డ్రిప్‌ ఇరిగేషన్‌ అందుబాటులో ఉందని వెల్లడిం చారు. జనరల్‌ కేటగిరి రైతులకు 80 శాతం, సన్న , చిన్న కారు రైతులకు 90 శాతం, ఎస్సీ ఎస్టీ రైతులకు వంద శాతం సబ్సీడీపై డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాలు అందిస్తా మన్నారు. జిల్లాలో 772 మంది రైతులు 2280 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ పంటలను సాగు చేస్తున్నారని, ఈ ఆర్థిక సంవత్సరం మరో రెండు వేల ఎకరాల సాగు లక్ష్యంగా ప్రణాళిలకలను రూపొందించామని పేర్కొన్నారు. రెండు శాఖల అధికారులు సమన్వ యంతో ఆయిల్‌పామ్‌ సాగుతో కలిగే ప్రయోజనాలు రైతులకు వివరిం చాలన్నారు. దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్యేక పర్యవేక్షణ చేస్తు న్నారని వివరించారు. అధికారులు నిర్ణయించిన లక్ష్యం తప్పకుండా పూర్తిచేయాలని సూచించారు. అర్హత, ఆసక్తి ఉన్న రైతులు తమ పరిధి లోని వ్యవసాయశాఖ, ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించాల ని కోరారు. ప్రతివారం వ్యవసాయశాఖ ఉద్యానవన శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించాలని, లక్ష్యం ఎంత వరకు పూర్తి చేశారో ఆరాతీయాలని, అసైన్డ్‌ భూముల సాగుచేస్తున్న రైతులపై దృష్టి సారిం చాలన్నారు. ఆయిల్‌పామ్‌ సాగు పెంచేలా చూడాలన్నారు. సమావే శంలో ఉద్యానవన శాఖ డీడీ శేఖర్‌, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి లత, జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 03 , 2025 | 12:41 AM