Share News

మహిళల కోసం ప్రత్యేక చట్టాలు..

ABN , Publish Date - Aug 03 , 2025 | 12:38 AM

మహిళలకు ప్రత్యేక చట్టాలున్నా యని సీనియర్‌ సివిల్‌ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రాధి క జైశ్వాల్‌ అన్నారు.

మహిళల కోసం ప్రత్యేక చట్టాలు..

తంగళ్లపల్లి, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): మహిళలకు ప్రత్యేక చట్టాలున్నా యని సీనియర్‌ సివిల్‌ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రాధి క జైశ్వాల్‌ అన్నారు. ఈనెల 9వ తేదిన ఆదివాసీ దినోత్సవం సందర్భంగా శనివారం తంగళ్లపల్లి మండల కేంద్రంలో గిరిజన మహిళ డిగ్రీ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్ధులు ఆటపాటలతో అలరించారు. అనంతరం సీనియర్‌ సివిల్‌జడ్జి రాధిక జైశ్వాల్‌ మాట్లాడుతూ చట్టాలపై విద్యార్థి దశ నుంచే అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఆదివాసీలకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయన్నారు. ఆర్థిక పరిస్థితి బాగా లేని వారికి ప్రభుత్వం న్యాయవాదిని నియమించి న్యాయాన్ని అంది స్తుందని, ఇతర చట్టాల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్ర మంలో లోక్‌ అదాలత్‌ సభ్యులు చింతోజు భాస్కర్‌, ఆడెపు వేణు, న్యాయవా దులు పర్శరాములు, మల్లేశ్‌ యాదవ్‌, కుంట శ్రీనివాస్‌, కళాశాల వైస్‌ప్రిన్సి పాల్‌ రేహన ఇఫాత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 03 , 2025 | 12:38 AM