Share News

రాజీవ్‌ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలి

ABN , Publish Date - Apr 28 , 2025 | 11:19 PM

రాజీవ్‌ యువ వికాసం పథకం కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని అడిషనల్‌ కలెక్టర్‌ లక్ష్మికిరణ్‌ అన్నారు. కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, బ్యాంకర్లతో సోమవారం సమావేశం నిర్వహించారు.

రాజీవ్‌ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలి

కరీంనగర్‌, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాజీవ్‌ యువ వికాసం పథకం కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని అడిషనల్‌ కలెక్టర్‌ లక్ష్మికిరణ్‌ అన్నారు. కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, బ్యాంకర్లతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజీవ్‌ యువ వికాసం పథకం కోసం జిల్లాలో 57,763 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. దరఖాస్తుల ఆన్‌లైన్‌ ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు. ప్రత్యేక అధికారులు దరఖాస్తుల విచారణ వేగవంతం చేయలన్నారు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్‌ కోటాలో నిర్దిష్ట లక్ష్యాన్ని ఎంపీడీవోలకు, మున్సిపల్‌ కమిషనర్లకు ఇదివరకే పంపించామని తెలిపారు. బ్యాంకుల నుంచి ఏవైనా సమస్యలు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో వెంకటేశ్వర్లు, జిల్లా గిరిజన అభివృద్ధిశాఖ అధికారి పవన్‌కుమార్‌, ఎంపీడీవోలు, మండల ప్రత్యేక అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2025 | 11:19 PM