చివరి దశలో కరీంనగర్ రైల్వే స్టేషన్ పనులు
ABN , Publish Date - Apr 28 , 2025 | 11:28 PM
కరీంనగర్ రైల్వే స్టేషన్ పనులు చివరి దశకు చేరుకున్నాయని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ ప్రాజెక్టు మేనేజర్ రమేష్‌రెడ్డి తెలిపారు. కరీంనగర్ రైల్వే స్టేషన్‌లో జరుగున్న అభివృద్ది పనులను ఆయన శనివారం సందర్శించారు.

కరీంనగర్ రూరల్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ రైల్వే స్టేషన్ పనులు చివరి దశకు చేరుకున్నాయని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ ప్రాజెక్టు మేనేజర్ రమేష్‌రెడ్డి తెలిపారు. కరీంనగర్ రైల్వే స్టేషన్‌లో జరుగున్న అభివృద్ది పనులను ఆయన శనివారం సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సరికొత్త హంగులతో కరీంనగర్ రైల్వే స్టేషన్ సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోందని తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీం కింద 26.64 కోట్ల వ్యయంతో రెండేళ్ల క్రితం పనులు చేపట్టామన్నారు. రైల్వే స్టేషన్ బయట, లోపల ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. రెండు వారాల్లో పనులను పూర్తి చేస్తామన్నారు. మూడు ప్లాట్ ఫాంలు, రెండు లిఫ్టులు, రెండు ఎస్కలేటర్లు, వెయిటింగ్ హాల్స్, మోడ్రన్ టాయిలెట్లు, డిజిటల్ డిస్‌ప్లేలు, సీసీ కెమెరాలు అందుబాటులోకి తెస్తామన్నారు. 15 రోజుల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రైల్వేస్టేషన్‌ను ప్రారంభిస్తామని చెప్పారు. ఆయన వెంట దక్షిణ మద్య రైల్వే శాఖ అధికారి సుబ్రహ్మణ్యం, స్టేషన్ మేనేజర్ ఉన్నారు.