Share News

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు..

ABN , Publish Date - Aug 03 , 2025 | 12:40 AM

వేములవాడ పట్టణం లో 2వేల మందికి పైగా ఇళ్లు లేవని లెక్కలు చెబుతున్నాయని, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తీసుకువెళుతాన ని, అందరికి ఇళ్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని స్థానిక ఎమ్మె ల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు..

వేములవాడ టౌన్‌, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): వేములవాడ పట్టణం లో 2వేల మందికి పైగా ఇళ్లు లేవని లెక్కలు చెబుతున్నాయని, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తీసుకువెళుతాన ని, అందరికి ఇళ్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని స్థానిక ఎమ్మె ల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. పట్టణంలోని ఎస్‌ఆర్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో శనివారం 144 మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ స్వంత ఇల్లు, జాగా లేని పేదలకు ఇందిరమ్మ రాజ్యంలో వారి కల నెరవేరుతుందన్నారు. పట్ట ణంలోని 144 మంది అర్హులైన వారికి బస్‌ డిపో పక్కన ఉన్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పట్టాలను ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాం లో నిర్మించి నిరుపయోగంగా మారిన ఇళ్లను పేదలకు పంపిణీ చేస్తు న్నామన్నారు. 12 బ్లాక్‌లలో జీ ప్లస్‌-2తో 144మందికి ఇళ్లు అందుబాటు లో ఉండటంతో మంజూరు పత్రాలు అందజేస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటీ సీఎం కేసీఆర్‌ రాజన్న ఆలయానికి ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలుకాలేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.150 కోట్లతో అభివృద్ధి పను లకు శ్రీకారం చుట్టామని తెలిపారు. మూలవాగుపై మూడో బ్రిడ్జి ఎందుకు నిర్మాణం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రంగురంగుల బ్రోచర్లతో మూలవాగుపై బ్రిడ్జి నిర్మాణ ఫొటోలు చూపించింది మీరు, మీ ప్రభుత్వం కాదా.. అని ప్రశ్నించారు. వంతెన భూసేకరణకు డబ్బులు రాలేదని ఆరోపిస్తున్నారని, రూ.6 కోట్ల నిధులు మంజూరైంది నిజం కాదా అని ప్రశ్నించారు. కొన్ని ఇళ్లు వక్ఫ్‌ బోర్డు పరిధిలో ఉండటంతో పరిహారం తీసుకోలేదని, రూ.47కోట్లతో రోడ్డు విస్తరణ పనులు చేస్తే నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం అందించామన్నారు. పట్టణంలో 2వేల మందికిపైగా ఇళ్లు లేవని లెక్కలు చెబుతున్నాయని, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొం గులేటి శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తీసుకువెళుతానని, అందరికి ఇళ్లు మంజూ రు చేసేందుకు కృషి చేస్తానని హామీచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కె ట్‌ కమిటీ చైర్మన్‌ రొండి రాజు, వైస్‌చైర్మన్‌ కనికరపు రాకేష్‌ మున్సిపల్‌ కమిషనర్‌ అన్వేష్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.

Updated Date - Aug 03 , 2025 | 12:40 AM