Share News

లక్ష్మణరేఖ దాటితే చర్యలు తప్పవు...

ABN , Publish Date - Apr 28 , 2025 | 11:16 PM

పార్టీ నిర్దేశించిన క్రమశిక్షణ లక్ష్మణరేఖ దాటితే చర్యలు తప్పవని ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్‌ పెరుమాళ్‌ కాంగెరస్‌ శ్రేణులను హెచ్చరించారు. కాంగ్రెస్‌ జిల్లా సంస్థాగత నిర్మాణం సన్నాహక సమావేశం సోమవారం డీసీసీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా విశ్వనాథన్‌ పెరుమాళ్‌ మాట్లాడుతూ పార్టీ క్రమశిక్షణ విధానాన్ని కార్యకర్త నుంచి నాయకుల వరకు అందరూ పాటించాలన్నారు.

లక్ష్మణరేఖ దాటితే చర్యలు తప్పవు...

కరీంనగర్‌ క్రైం, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): పార్టీ నిర్దేశించిన క్రమశిక్షణ లక్ష్మణరేఖ దాటితే చర్యలు తప్పవని ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్‌ పెరుమాళ్‌ కాంగెరస్‌ శ్రేణులను హెచ్చరించారు. కాంగ్రెస్‌ జిల్లా సంస్థాగత నిర్మాణం సన్నాహక సమావేశం సోమవారం డీసీసీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా విశ్వనాథన్‌ పెరుమాళ్‌ మాట్లాడుతూ పార్టీ క్రమశిక్షణ విధానాన్ని కార్యకర్త నుంచి నాయకుల వరకు అందరూ పాటించాలన్నారు. పార్టీలో కార్యకర్తలు, నాయకులు ఐక్యంగా ఉండాలని, బేదాభిప్రాయాలు విడనాడాలన్నారు. పార్టీని కిందిస్థాయి నుంచి నిర్మాణం చేసేందుకు సమావేశాలు, అభిప్రాయాల సేకరణ తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో రాజ్యాంగ పరిరరక్షణ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు.

ఫ గ్రామస్థాయి నుంచి పార్టీ పటిష్ఠానికి చర్యలు

పరిశీలకులు నమిండ్ల శ్రీనివాస్‌, రఘునాథ్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ సోషల్‌ మీడియా విభాగంతోపాటు గ్రామ స్థాయి నుంచి పటిష్ఠ పరిచేందుకే సంస్థాగత నిర్మాణం కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో ఐదుగురితో కమిటీ వేస్తామని, మండలం కమిటీకి ఐదుగురు, బ్లాక్‌స్థాయి కమిటీకి ముగ్గురు, డీసీసీకి ఐదుగురి పేర్లను ప్రతిపాదించి. రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌కు పంపిస్తామన్నారు. మే 20లోగా ఈ సమావేశాలు పూర్తి కావాలన్నారు. కార్యకర్తలు గ్రామ, మండల, బ్లాక్‌, జిల్లా కమిటీలకు దరఖాస్తు చేసుకోవచ్చని, తమ బయోడాటా జతపరిచి అందజేయాలన్నారు. కమిటీలకు ప్రతిపాధించిన పేర్లను కార్యకర్తల సమక్షంలోనే చదివి వినిపిస్తామన్నారు.

ఫ కష్టపడ్డవారికి గుర్తింపు ఉంటుంది

డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ కష్టపడ్డ కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందని, ఎవరు కూడా నిరశాపడవద్దని అన్నారు. బేదాభిప్రాయాలుంటే పార్టీలోపల పరిష్కరించుకో వాలన్నారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కార్యకర్తలు రక్తన్ని చెమటాగా మలిచి కాంగ్రెస్‌పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారన్నారు. మాజీ ఎమ్మెల్యే కటుకం మృత్యుంజయం మాట్లాడుతూ కార్యకర్తలే నాయకులకు మార్గదర్శకులన్నారు. సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ వేదికపై గొడవపడకుండా పార్టీ పటిష్ఠానికి పాటుపడాలన్నారు. కరీంనగర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి పురుమల్ల శ్రీనివాస్‌ మాట్లాడుతూ కష్టకాలంలో పార్టీ బరువు బాధ్యతలు మోసిన కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారని, వారికి ఏదో ఒక పదవి ఇస్తే బాగా పని చేస్తారన్నారు. 2017కు ముందు నుంచి పార్టీలో ఉన్న వారిని గుర్తించాలని టీపీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్‌కుమార్‌ అన్నారు. కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించాలని వెలిచాల రాజేందర్‌రావు కోరారు. పదేళ్లు పార్టీ జెండా మోసి, ధర్నాలు, ఆందోళనలు చేస్తే తగిన గుర్తింపే లేదని మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు కర్ర సత్యప్రన్నరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆటుపోట్లను తట్టుకుని నిలబడినవారికి భవిష్యత్‌ ఉంటుందని కిసాన్‌ సెల్‌ అధ్యక్షులు పత్తి కృష్ణారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌పార్టీలో అంతర్గత విబేధాలను పరిష్కరిస్తే పార్టీకి తిరుగుండదని అల్ఫోర్స్‌ నరేందర్‌రెడ్డి అన్నారు. తమ విద్యాసంస్థల్లో కాంగ్రెస్‌ పార్టీ కుటుంబసభ్యుల పిల్లలకు రాయితీ కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో అబ్దుల్‌ రహహమాన్‌, కొరివి అరుణ్‌కుమార్‌, మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు ఎండీ తాజ్‌, హుజూరాబాద్‌ నియోజకవర్గ ఇంచార్జి వొడితెల ప్రణవ్‌బాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సత్తు మల్లేశం, అర్బన్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌ గడ్డం విలాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌, ఆర్టీఏ మెంబర్‌ పడాల రాహుల్‌, నాయకులు రుద్ర సంతోష్‌, కోమటిరెడ్డి పద్మాకర్‌ రెడ్డి, శ్రావణ్‌ నాయక్‌, కాంరెడ్డి రాంరెడ్డి, ముత్యం శంకర్‌, సిరాజ్‌ హుస్సేన్‌, చేర్ల పద్మ, బోనాల శ్రీనివాస్‌, అహ్మద్‌ అలీ, కుర్ర పోచయ్య, పంజాల స్వామి గౌడ్‌, ఆకుల ప్రకాశ్‌, ఎలగందుల మల్లేశం, రాజేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2025 | 11:16 PM