Share News

జిల్లా కోర్టు మోడల్‌ భవన నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌

ABN , Publish Date - Apr 28 , 2025 | 12:55 AM

కక్షిదారుల సంఖ్య పెరుగుతున్న క్రమం లో జిల్లా కోర్టు మోడల్‌ భవనం నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

జిల్లా కోర్టు మోడల్‌ భవన నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌

సిరిసిల్ల క్రైం, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): కక్షిదారుల సంఖ్య పెరుగుతున్న క్రమం లో జిల్లా కోర్టు మోడల్‌ భవనం నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యా ప్తంగా నిర్మించే కోర్టు భవనాలన్నింటికి ఒకే విధంగా నిర్మాణ రూపకల్పన చేసి ‘న్యాయ నిర్మాణ్‌’గా నామకరణం చేశారు. ప్రస్తుతం పాత కోర్టు సుముదాయం కక్షిదా రులు, న్యాయవాదులు, పోలీసులు, ఇతరులతో రద్దీగా మారింది. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని సిరిసిల్ల పట్టణంలో 5.1ఎకరాల స్థలంలో జిల్లా కోర్టు భవన సముదాయా న్ని నిర్మించడానికి ప్లాన్‌ సిద్ధమైంది. ఇందులో భాగంగా రోడ్లు, భవనాల శాఖ ఇంజ నీరింగ్‌ అధికారులు హైకోర్టు ఆదేశాల మేరకు జీ ప్లస్‌5 అంతస్థులతో 12కోర్టుల నిర్మా ణానికి రూపకల్పన చేశారు. ఈ మోడల్‌ జిల్లా కోర్టు భవనం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.86.74కోట్లు కేటాయించింది. నూతన కోర్టు భవనం నిర్మాణానికి ప్రణా ళికలు సిద్ధం కావడంతో కోర్టు వ్యవహారాలు అద్దె భవనంలోకి మారనున్నాయి.

శిథిలావస్థలకు చేరిన పాతభవనం..

పాత తాలుకా కేంద్రమైన సిరిసిల్ల పట్టణంలో 1973లో మున్సిఫ్‌ కోర్టును ప్రారం భించారు. 52సంవత్సరాల క్రితం ఏర్పాటుచేసిన మున్సిఫ్‌కోర్టు పాత భవనం శిథిలా వస్థకు చేరింది. ఇందులో కక్షిదారులు, న్యాయవాదుల సంఖ్య పెరగడంతో ఇరుకిరుకు గా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లాగా రూపాంతరం చెందిన తర్వాత సిరిసిల్లకు జిల్లా కోర్టు, 1వ అదనపు సెషన్స్‌ జిల్లా కోర్టుతో పాటు పోక్సో కోర్టు, అదనపు జూని యర్‌ సివిల్‌ జడ్జి, 2వ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులు మంజూరయ్యాయి. ఈ విధంగా కోర్టుల సంఖ్య పెరగడంతో పాత భవనాలు ఏమాత్రం సరిపోవడంలేదు. మరోవైపు పాత భవనంలో న్యాయవాదులకు, కక్షిదారులకు మూత్రశాలలు లేవు. వీట న్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం జిల్లా కోర్టు సమీకృత భవన సముదాయం నిర్మాణానికి రగుడు సమీపంలో 10ఎకరాలు కేటాయించింది. సిరిసిల్ల పాత కోర్టు 5.1ఎకరాల స్థలం ఉన్నందున కొత్త భవనం అనువైనదని గుర్తించి నిర్మాణానికి రూప కల్పన చేశారు.

అధునాతన హంగులతో ‘న్యాయ నిర్మాణ్‌’

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 5.1ఎకరాల స్థలంలో రూ.86.74 కోట్లతో అధు నాతన హంగులతో ‘న్యాయ నిర్మాణ్‌’ సమీకృత భవన సముదాయానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. జీ ప్లస్‌ 5 విధానంలో భవన సముదాయాన్ని నిర్మించడానికి రూపకల్పన చేశారు. ఇందులో 12కోర్టు హాళ్లు, ఆఫిసర్స్‌ చాంబర్స్‌, ప్రతి ఫోర్‌లో బార్‌ అసోసియేషన్‌ హాలు, టాయిలెట్స్‌, కక్షిదారుల చాంబర్‌, విజిటర్స్‌ చాంబర్‌లను మోడల్‌ విధానంలో నిర్మించడానికి రూపొందించారు. ప్రతి ఫ్లోర్‌కు వెళ్లేందుకు కక్షిదా రులకు ఒక లిఫ్ట్‌, న్యాయవాధికారులకు ఒక లిఫ్ట్‌ ఏర్పాటు చేయనున్నారు. గ్రౌండు ఫ్లోర్‌లో పూర్తిస్థాయిలో పార్కింగ్‌ సౌకర్యం కల్పించడానికి నిర్ణయించారు. ఇందులో ప్రస్తుతం ఉన్న జిల్లా కోర్టు, 1వ అడిషనల్‌ సెషన్స్‌ జిల్లా కోర్టు, పోక్సో కోర్టు, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ కోర్టు, 1వ అదనపు జూనియర్‌ సివిల్‌ కోర్టు, 2వ అదనపు జూనియర్‌ సివిల్‌ కోర్టులతో పాటు భవిష్యత్తులో మంజూరయ్యే మరో ఆరు కోర్టులు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా న్యాయ నిర్మాణ్‌ భవనాన్ని నిర్మించడానికి టెండర్లు పిలిచారు. జూలై రెండో వారంలో నూతన భవన సముదాయానికి శంకుస్థాపన చేసేందుకు సిద్ధం చేస్తున్నారు.

జూలైలో అద్దెభవనంలోకి కోర్టులు..

నూతన కోర్టు సమీకృత భవనం నిర్మాణానికి రూపకల్పన చేయడంతో పాత భవనంలో ఉన్న కోర్టులు అద్దె భవనంలోకి మారనున్నాయి. జూలై మొదటివారం నుంచి సిరిసిల్ల పట్టణంలోని సర్థార్‌నగర్‌లోగల ఓ భవనంలో మూడు కోర్టుల వ్యవ హారాలు సాగుతాయి. ఇందులో పీడీఎం, ఏడీఎం, 2వ ఏడీఎం కోర్టులు ఉంటాయి. సిరిసిల్ల పట్టణంలోని సాయినగర్‌లో అద్దె భవనంలోకి సీనియర్‌ సివిల్‌ కోర్టు మారు తుంది. మిగతా జిల్లా కోర్టు, 1వ అడిషనల్‌ సెషన్స్‌ జిల్లా కోర్టు, పోక్సో కోర్టులు ప్రస్తు తం ఉన్న బార్‌ అసోసియేషన్‌ హాలులోనే కొనసాగుతాయి.

Updated Date - Apr 28 , 2025 | 12:55 AM