గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి..
ABN , Publish Date - Aug 02 , 2025 | 12:56 AM
గీత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.

బోయినపల్లి, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి) : గీత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బోయినపల్లి మండలం మల్కాపూర్‌లో శుక్రవారం వనమహోత్సవం కార్యక్రమం జరిగింది. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో మల్కాపూర్ గ్రామంలో ఈత మొక్కలను పంపిణీ చేయగా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మొక్కలను సత్యం పాల్గొని మొక్కలను నాటారు. అనంత రం బోయినపల్లి పంచాయతీ కార్మికుడు మల్లేశం అనారోగ్యంతో మృతిచెందగా ప్ర భుత్వం తరఫున 50వేల ఆర్థికసాయాన్ని చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశా రు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నారాయణరెడ్డి, ఎంపీడీవో జయశీల, డైరెక్టర్ కొట్టేపల్లి సుధాకర్, ఏఎంసీ చైర్మన్ ఎలేష్ యాదవ్, వైస్ చైర్మన్ వినోద్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు కుస రవీందర్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షు డు కౌడగాని వెంకటేష్ మండల పార్టీ అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, బ్లాక్ కాం గ్రెస్ అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి, నాగుల వంశీ తదితరులు పాల్గొన్నారు.