Share News

విద్యతోనే సమాజ, వ్యక్తిత్వ మార్పు

ABN , Publish Date - Aug 02 , 2025 | 12:54 AM

విద్యతోనే సమాజ, వ్యక్తిగత మార్పు సాధ్యమని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అన్నారు.

విద్యతోనే సమాజ, వ్యక్తిత్వ మార్పు

ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి) : విద్యతోనే సమాజ, వ్యక్తిగత మార్పు సాధ్యమని, జాతీయ స్థాయి విద్యను సాంకేతికతతో జిల్లాలోని గ్రామీణ విద్యార్థులకు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మహాత్మాజ్యోతిబా ఫూలే ఇంటర్‌,డిగ్రీ కళాశాలలో అన్‌ అకాడమీ ద్వారా అందిస్తున్న ఉచిత ఆన్‌లైన్‌ శిక్షణ తరగతులను ఏఎంసీ చైర్‌పర్సన్‌ సబేరాబేగం, కాంగ్రెస్‌ పార్టీ సిరిసిల్ల నియోజక వర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డిలతో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఆన్‌లైన్‌ తరగతులను విద్యార్థులకు బోధించారు. అనంతరం కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా మాట్లాడుతూ ప్రభుత్వ రెసిడెన్షియల్‌ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులకు సర్కారు ఉచిత ఆన్‌లైన్‌ శిక్షణ తరగతులను నిర్వహిస్తోందని అన్నారు. దేశంలోని నిపుణులతో విద్యాబోధన జరుగుతోందని, ఢిల్లీ విద్యార్థులకు అందే శిక్షణను సాంకేతికతతో జిల్లా విద్యార్థులకు అంది స్తున్నామని అన్నారు. విద్యార్థులు నిత్యం 2 గంటల పాటు శిక్షణ తరగతులకు హాజరై ప్రతిభను పెంచుకోవాలని అన్నారు. గణితం, సామాన్యశాస్త్రం, ఇతర పాఠ్యాంశాల్లో వచ్చే టెస్ట్‌ సిరీస్‌ను ప్రాక్టీస్‌ చేయాలని అన్నారు. ఐఐటీ, జేఈఈ, నీట్‌ తదితర జాతీ య స్థాయి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ చూపించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. కాలిక్యులస్‌, ఆర్గానిక్‌ ఫార్మింగ్‌, ఎలక్ర్టోమ్యాగ్నెటిసన్‌ వంటి పాఠ్యాంశాలను పక్కాగా నేర్చుకోవాలని అన్నారు. విద్యార్ధి దశలో పదో, ఇంటర్‌ మూడేళ్లు కీలకమని అన్నారు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే జీవితంలో ఉత్తమ స్థాయికి చేరుకుంటారని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అన్నారు. కేకే మహేందర్‌రెడ్డి మాట్లాడు తూ ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థు లు కార్పొరేటు స్థాయిలో రాణించేలా ప్రత్యేక కార్యాచరణ తీసుకుని ఆ దిశగా ముం దుకు సాగుతోందన్నారు జిల్లాలోని విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతుల ద్వారా పోటీ పరీక్షలకు సంసిద్ధులను చేసేందుకు కలెక్టర్‌ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని అన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, కళాశాల ప్రిన్సిపాల్‌ వీరప్రభాకర్‌, ఎంపీడీవో సత్తయ్య, నాయకులు నర్సయ్య, లక్ష్మారెడ్డి, రాంరెడ్డి, విజయ్‌రెడ్డి, బాబు, బుచ్చాగౌడ్‌, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 02 , 2025 | 12:54 AM