నేడు రేషన్ కార్డుల పంపిణీ
ABN , Publish Date - Aug 03 , 2025 | 12:59 AM
కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం జిల్లాలో నిర్వహించనున్నారు. రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆదివారం జిల్లాకు రానున్నారు.

- జిల్లాకు మంత్రులు, ఉత్తమ్, తుమ్మల
- శంకరపట్నం, రామడుగులో కార్యక్రమం
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం జిల్లాలో నిర్వహించనున్నారు. రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆదివారం జిల్లాకు రానున్నారు. రేషన్‌కార్డుల పంపిణీకి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిన ప్రభుత్వం జూలై 25 నుంచి ఆగస్టు 10 వరకు దీనిని కొనసాగించాలని నిర్ణయించింది. ఇన్‌చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలకు తప్పనిసరిగా హాజరు కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జూలై 14న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు ఆదివారం మానకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండల కేంద్రంలో, చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండల కేంద్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నారు.
మంత్రుల పర్యటన ఇలా..
ఆదివారం ఉదయం మంత్రులు హైదరాబాద్ నుంచి బయల్దేరి హెలీక్యాప్టర్‌లో 11 గంటలకు రామగుండం చేరుకుని అంతర్గాం మండలంలో ఏర్పాటు చేసిన రామగుండం లిఫ్టు ఇరిగేషన్ పథకాన్ని ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి ధర్మపురి చేరుకుని అక్కడ కొత్త రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత 3 గంటల నుంచి 4 గంటల వరకు శంకరపట్నం మండలంలో రేషన్ కార్డురు పంపిణణ చేస్తారు. సాయంత్రం 4:30 నుంచి 5:30 గంటల వరకు రామడుగు మండలంలో జరిగే రేషన్ కార్డుల పంపిణీలో మంత్రులు పాల్గొంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన
10 వరకు రేషన్ కార్డుల పంపిణీ
కార్యక్రమంలో రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించింది. ఆ తర్వాత ఆన్‌లైన్‌లోనూ రేషన్ కార్డుల కోసం, పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రజలకు సూచించింది. ఈ మేరకు వచ్చిన దరఖాస్తులన్నింటిని క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి అర్హులైన వారందరికి రేషన్‌కార్డులను మంజూరు చేశారు. పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యులను నమోదు చేశారు. ఈ కార్డులను ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో లబ్ధిదారులకు అందించనున్నారు. ఆన్‌లైన్‌లో ముద్రించిన కార్డులను ప్రస్తుతం అందరికి అందజేసి ఆ తర్వాత డిజిటల్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా జిల్లాలో జూలై వరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో చేసుకున్న దరఖాస్తుల మేరకు 36,218 కొత్త రేషన్ కార్డులను మంజూరు చేశారు. పాత రేషన్‌కార్డుల్లో కొత్త సభ్యులు నమోదు చేయించుకోవడానికి 52,201 దరఖాస్తులను పరిశీలించి అప్రూవ్ చేశారు. ప్రస్తుతం 88,419 కొత్త రేషన్‌కార్డులు జారీ కానున్నాయి. కొత్త రేషన్ కార్డుల పంపిణీ జూలై 25 నుంచి ప్రారంభమయింది. అందులో భాగంగానే మంత్రులు ఆదివారం రెండు నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొని రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమం ఈ నెల 10 వరకు కొనసాగనున్నది.