Share News

రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్న బీజేపీ

ABN , Publish Date - Apr 28 , 2025 | 12:53 AM

రాజ్యాంగ స్ఫూర్తిని బీజేపీ దెబ్బతీస్తూ.. అప్రజాస్వామిక పాలనను కొనసాగిస్తోందని కాంగ్రెస్‌ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్‌పర్సన్‌ సబేరాబేగంలు అన్నారు.

రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్న బీజేపీ

ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ స్ఫూర్తిని బీజేపీ దెబ్బతీస్తూ.. అప్రజాస్వామిక పాలనను కొనసాగిస్తోందని కాంగ్రెస్‌ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్‌పర్సన్‌ సబేరాబేగంలు అన్నారు. ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లి, రాచర్లబొప్పాపూర్‌ గ్రామాల్లో జై బాపు.. జై భీమ్‌.. జై సంవిధాన్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా వారు పార్టీ శ్రేణులతో కలిసి రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేశారు. గ్రామాల్లోని మహాత్మాగాంధీ, బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేశారు. రాజ్యాంగ పరిరక్షణే కాంగ్రెస్‌ పార్టీ ధ్యేయమని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలుచేస్తోందన్నారు. రాజ్యాంగం కల్పిస్తున్న హక్కుల సాధన దిశగా అడుగులు వేస్తోందన్నారు. కార్యక్రమంలో నాయకులు నర్సయ్య, లక్ష్మారెడ్డి, గౌస్‌, సాహెబ్‌, రాంరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, బాబు, బాలయ్య, శ్రీనివాస్‌, పద్మారెడ్డి, బాల్‌రెడ్డి, కిష్టారెడ్డి, సత్యనారాయణరెడ్డి, కిషన్‌, బుచ్చాగౌడ్‌, రాజేందర్‌, సుదర్శన్‌, మహేందర్‌, బాబా, బాలపోశయ్య, పర్శరాములు, దేవరాజు, నారాయణరెడ్డి, చంద్రయ్య, లత, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2025 | 12:53 AM