Share News

Kamareddy: గ్రామాల్లో మద్యపానాన్ని నిషేధిస్తూ తీర్మానం

ABN , Publish Date - Jun 21 , 2025 | 04:38 AM

కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని గుండారం, ఎల్లాపూర్‌తండా, నడిమితండా గ్రామాల్లో మద్యపానాన్ని నిషేధిస్తూ ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానించారు.

Kamareddy: గ్రామాల్లో మద్యపానాన్ని నిషేధిస్తూ తీర్మానం

  • ఉల్లంఘిస్తే రూ.లక్ష జరిమానా.. ఏడు చెప్పుదెబ్బలు

రాజంపేట, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని గుండారం, ఎల్లాపూర్‌తండా, నడిమితండా గ్రామాల్లో మద్యపానాన్ని నిషేధిస్తూ ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ మేరకు శుక్రవారం గుండారం గ్రామంలో మూడు గ్రామాల ప్రజలు సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. తమ గ్రామాల్లో బెల్ట్‌షాపుల వల్ల యువత పెడదోవ పడుతోందని, మద్యపానం వల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. అందుకే తమ ఊళ్లలో మద్యపానాన్ని నిషేధిస్తూ తీర్మానించినట్లు తెలిపారు.


దీనిని ఎవరు ఉల్లంఘించినా రూ.లక్ష జరిమానాతో పాటు ఏడు చెప్పుదెబ్బల శిక్షను విధిస్తామన్నారు. మద్యం తాగినా, అమ్మినా అవే చర్యలు వర్తిస్తాయని తెలిపారు. ఆయా గ్రామాల్లో మద్యం అమ్మే వారి గురించి సమాచారం అందించిన వారికి రూ.20 వేల నజరానా ఇస్తామని గ్రామస్థులు ప్రకటించారు.

Updated Date - Jun 21 , 2025 | 04:38 AM